విదేశీ జమలు, సిరియాలో అమెరికా కుట్ర…. క్లుప్తంగా-27.02.13

స్వదేశీయుల విదేశీ జమల్లో ఇండియా టాప్ విదేశాలలో పని చేసే స్వదేశీయులు తమ తమ దేశాలలోని కుటుంబాలకు తమ సంపాదనలో కొంత భాగాన్ని పంపుతుంటారు. ఇలా పంపే మొత్తాల్లో భారతీయులు పంపే మొత్తం మిగతా అన్నీ దేశాల కంటే ఎక్కువని ప్రపంచ భ్యాంకు లెక్కలు చెబుతున్నాయి. 2012లో ఈ జమలు భారత దేశానికి 69 బిలియన్ డాలర్లు రాగా, చైనాకి వచ్చిన మొత్తం $60 బిలియన్లు. ఫిలిప్పైన్స్ ($24 B), మెక్సికో ($23 B), నైజీరియా ($21…

సిరియాలో జరుగుతున్నదీ, పత్రికల్లో వస్తున్నదీ ఒకటి కాదు -అన్హర్ కొచ్నెవా

సిరియా లో బషర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నారనీ, ప్రభుత్వం వారినీ అత్యంత క్రూరంగా చంపుతోందనీ, అణచివేస్తోందనీ పశ్చిమ దేశాల పత్రికలు ప్రచారం చేస్తున్నాయి. నిత్యం అక్కడ హత్యాకాండలు జరుగుతున్నాయనీ ప్రభుత్వ సైనికులు, ప్రభుత్వ మద్దతుదారులయిన మిలిషియా లు అత్యంత క్రూరంగా ప్రజలను చంపుతున్నాయనీ వార్తలు ప్రచురిస్తున్నాయి. ఈ మధ్యనే ‘హౌలా హత్యాకాండ’ అంటూ అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లతో పాటు ఇతర పశ్చిమ దేశాలు కాకి గోల చేస్తూ సిరియా పై…

టెర్రరిస్టులకు ఐక్యరాజ్యసమితి మద్దతు? -సిరియా ప్రభుత్వం

ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ‘బాన్-కి-మూన్’ సిరియాలో విధ్వంసం సృష్టిస్తున్న టెర్రరిస్టులకు మద్దతు ఇచ్చేలా ప్రకటనలు జారీ చేయడం పట్ల సిరియా పత్రికలు ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నాయని ‘అసోసియేటెడ్ ప్రెస్’ ని ఉటంకిస్తూ ‘ది హిందూ’ తెలిపింది. సమితి అధిపతి తన విమర్శలను పూర్తిగా సిరియా ప్రభుత్వంపైనే కేంద్రీకరించడం ద్వారా టెరరిస్టుల హింసను ప్రోత్సహిస్తున్నాడని సిరియా పత్రికలు విమర్శలు ఎక్కుపెట్టాయి. మానవ బాంబులను ప్రయోగిస్తూ వేలమంది ప్రజలను బలి గొంటున్న టెర్రరిస్టు చర్యలను ఖండిస్తూ అంతర్జాతీయ సంస్ధలు…

మరో హత్యా కాండ, ఈ సారి సిరియాలో

ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా సైనికులు ఆఫ్ఘన్ పౌరులను ఊచకోత కోసిన రెండవ రోజే సిరియాలో పౌరుల ఊచకోత జరిగింది. సిరియాలో జొరబడి సంవత్సర కాలంగా అద్దె తిరుగుబాటు నడుపుతున్న పశ్చిమ దేశాల కిరాయి మూకలు తాజాగా ఈ హత్యా కాండకు పాల్పడ్డాయని సిరియా ప్రభూత్వ మీడియాను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. ఐక్యరాజ్య సమితి మాజీ అధ్యక్షుడు కోఫీ అన్నన్ సిరియా సందర్శిస్తున్న సందర్భంలో ఆయనను ప్రభావితం చేయడానికే విదేశీ కిరాయి మూకలు ఈ హత్యాకాండకి దిగాయని సిరియా…