సిరియాపై క్షిపణి దాడి వార్తలు; రూపాయి, షేర్లు పతనం

సిరియాపై అమెరికా క్షిపణి దాడి చేసిందన్న వార్తలు గుప్పుమన్నాయి. అమెరికా, సిరియాపై రెండు క్షిపణులతో దాడి చేసిందనీ, ఈ దాడి ఫలితంగా సిరియా రాజధాని డమాస్కస్ లో 50 మంది వరకూ చనిపోయారనీ వార్తలు షికారు చేస్తున్నాయి. తెలుగు టి.వి ఛానెళ్లు ఈ వార్తను ఎక్కడినుండి సంపాదించాయో గానీ ఈ రోజు మధ్యాహ్నం నుండి స్క్రోలింగ్ లో చూపాయి. అయితే ఇందులో నిజం లేదని

రసాయన దాడి మా పనే -సిరియా తిరుగుబాటుదారులు

నిజానికి ఇది సంచలనవార్త! ఆగస్టు 21 తేదీన సిరియాలో రసాయన ఆయుధాలతో జరిగిన దాడికి సిరియా ప్రభుత్వమే బాధ్యత వహించాలనీ, అధ్యక్షుడు బషర్ అస్సాద్ ఆదేశాలతోనే ఈ దాడి జరిగిందని అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా, విదేశీ మంత్రి జాన్ కెర్రీ ఒక పక్క చెవి కోసిన మేకల్లా అరుస్తూనే ఉన్నారు. మరో పక్క సదరు రసాయన దాడికి తామే బాధ్యులమని సిరియా తిరుగుబాటుదారులు అంగీకరించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ విలేఖరి ఒకరు తిరుగుబాటులతో చేసిన ఇంటర్వ్యూల ఆధారంగా…

ఒంటరైనా వెలివేసినా సిరియా దాడికి కాలుదువ్వుతున్న అమెరికా

సిరియాపై పరిమిత దాడి చేసి రసాయన ఆయుధాలు ప్రయోగించినందుకు అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సాద్ ను శిక్షిస్తానని ప్రకటించిన అమెరికా ఒంటరిగా మిగిలింది. సిరియా దాడిలో భాగస్వామ్యం వహించడానికి వీలు లేదని బ్రిటన్ పార్లమెంటు తేల్చి చెప్పింది. ‘దాడికి సై’ అన్న ఫ్రాన్సు వెనక్కి తగ్గి ‘ఐరాస అనుమతితో చేద్దాము, చర్చలు కూడా చేద్దాము’ అంటూ యుద్ధ పిపాసను తగ్గించుకుంది. దాడికి సహకరించేది లేదని జర్మనీ స్పష్టం చేసింది. ఐరాస పరిశీలకుల నివేదిక అందకుండా దాడి వద్దే వద్దు…

మధ్యప్రాచ్యం: టర్కీకి అమెరికన్ పేట్రియాట్, సిరియాకి రష్యన్ ఇస్కందర్

మధ్యప్రాచ్యం (Middle-East) లో ఉద్రిక్తతలు ప్రమాదకరమైన స్ధితికి చేరుతున్నాయి. సిరియాలో కిరాయి తిరుగుబాటుని రెచ్చగొడుతూ ముస్లిం టెర్రరిస్టులను ప్రవేశపెడుతున్న టర్కీకి అమెరికా పేట్రియాట్ క్షిపణులను సరఫరా చేసినందుకుగాను రష్యా ప్రతిచర్యలు చేపట్టింది. అమెరికా ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న క్షిపణి రక్షణ వ్యవస్ధ (Missile Defence System) కి కూడా దొరకని అత్యంత అధునాతనమైన ‘ఇస్కందర్’ క్షిపణులను సిరియాకి సఫరా చేసింది. టర్కీ కోరికపై పేట్రియాట్ క్షిపణులను అమెరికా సరఫరా చేశాక ‘అతి చేయవద్దంటూ’ టర్కీని రష్యా హెచ్చరించిన మరుసటి…

మద్యధరా సముద్రంలో సిరియా సమీపాన మొహరించిన అమెరికా, రష్యా యుద్ధ నౌకలు

లిబియా విషయంలో పచ్చి అబద్ధాలు ప్రచారం చేసి, లేని తిరుగుబాటుకి సాయంగా సైనిక జోక్యం చేసుకుని చివరికి ఆ దేశ అధ్యక్షుడిని చంపి, ఆల్-ఖైదాతో కుమ్మక్కయ్యి మరీ తొత్తు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లు అదే తరహాలో సిరియాలో కూడా జోక్యం చేసుకోవడానికి అనేక కుట్రలు పన్నుతున్నాయి. అందులో భాగంగా అమెరికా ప్రవేశపెట్టిన అద్దె తిరుగుబాటుదారులే సిరియా ప్రజలపై కాల్పులు జరిపి పొట్టనబెట్టుకుంటున్నా, పశ్చిమ పత్రికలు రోజూ అనేక అబద్ధాలని సృష్టించి, సిరియా…