అమెరికా దాడి చేస్తే సిరియాకు సాయం చేస్తాం -పుతిన్

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ రంగంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో సాహసోపేతమైన అడుగు వేసినట్లే కనిపిస్తోంది. అంతర్ధానం అవుతున్న అమెరికా ప్రాభవం స్ధానంలో రష్యాను ప్రవేశపెట్టడానికి లేదా రష్యాకు వీలయినంత చోటు దక్కించడానికి పుతిన్ ఏ అవకాశాన్ని వదులుకోదలచలేదని ఆయన మాటలు చెబుతున్నాయి. పెద్దగా పటాటోపం లేకుండా, వాగాడంబరం జోలికి పోకుండా నిశ్శబ్దంగానే అయినా స్ధిరంగా ఆయన వేస్తున్న అడుగులు, చేస్తున్న ప్రకటనలు పశ్చిమ సామ్రాజ్యవాదులకు బహుశా చెమటలు పట్టిస్తుండవచ్చు. సిరియాపై అమెరికా ఏకపక్షంగా దాడి…

ఒంటరైనా వెలివేసినా సిరియా దాడికి కాలుదువ్వుతున్న అమెరికా

సిరియాపై పరిమిత దాడి చేసి రసాయన ఆయుధాలు ప్రయోగించినందుకు అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సాద్ ను శిక్షిస్తానని ప్రకటించిన అమెరికా ఒంటరిగా మిగిలింది. సిరియా దాడిలో భాగస్వామ్యం వహించడానికి వీలు లేదని బ్రిటన్ పార్లమెంటు తేల్చి చెప్పింది. ‘దాడికి సై’ అన్న ఫ్రాన్సు వెనక్కి తగ్గి ‘ఐరాస అనుమతితో చేద్దాము, చర్చలు కూడా చేద్దాము’ అంటూ యుద్ధ పిపాసను తగ్గించుకుంది. దాడికి సహకరించేది లేదని జర్మనీ స్పష్టం చేసింది. ఐరాస పరిశీలకుల నివేదిక అందకుండా దాడి వద్దే వద్దు…