ఐరాస కాన్వాయ్ పై దాడి అమెరికా పనేనా?

  సెప్టెంబర్ 19 తేదీన అలెప్పో ప్రాంతంలో ఐరాస హ్యుమానిటేరియన్ కాన్వాయ్ పై జరిగిన దాడి విషయమై సరికొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. దాడి జరిగిన సమయంలో, ఆ సమయానికి ముందూ వెనకా, అలెప్పో ప్రాంతంలో రికార్డ్ అయిన ఫ్లయిట్ డేటా వివరాలను పరిశీలించిన రష్యన్ ప్రభుత్వం ఈ కొత్త వివరాలను వెల్లడి చేసింది.  అలెప్పో ప్రాంతం లోని ఉరుమ్ ఆల్-కుబ్రా ప్రాంతంలో ఐరాస కాన్వాయ్ ప్రయాణిస్తూ ఉండగా ఎయిర్ అటాక్ జరిగిందని ఐరాస తెలిపింది. ఆ…

సిరియా టెర్రరిస్టులకు ఇజ్రాయెల్ సాయం -ఐరాస

ఇప్పుడిక అనుమానం అనవసరం. ఇజ్రాయెల్ నిజ స్వరూపం ఏమిటో స్పష్టంగా తేటతెల్లం అయిపోయింది. న్యాయమైన పాలస్తీనా ప్రజల పోరాటాలను టెర్రరిజంగా చెప్పుకుంటూ ప్రపంచ దేశాల మద్దతు పొందేందుకు ప్రయత్నించే యూదు రాజ్యం తాను స్వయంగా సిరియా టెర్రరిస్టులకు ఆయుధ, వైద్య సహాయం అందజేస్తోందని ఐరాస నివేదికలు స్పష్టం చేశాయి. 1967 నాటి ఐరాస తీర్మానం అనుసారం సిరియా-ఇజ్రాయెల్ సరిహద్దులో ఇజ్రాయెల్ ఆక్రమిత సిరియా భూభాగం గోలన్ హైట్స్ లో నెలకొల్పిన ఐరాస కార్యాలయం UNDOF సంస్ధ ఐరాస…

సిరియా: అంతులేని విధ్వంసం, శాంతిలేని మధ్యప్రాచ్యం

సిరియా ప్రభుత్వం తన రసాయన ఆయుధాలను విధ్వంసం చేయడానికి ఐరాసకూ, పశ్చిమ దేశాలకూ పూర్తిగా సహకరించినా అక్కడ విధ్వంసం ఆగలేదు. అమెరికా, ఐరోపాలు అందిస్తున్న ఆయుధ సహకారంతో తిరుగుబాటు మూకలు చెలరేగిపోతూనే ఉన్నాయి. అంతులేని మహా విధ్వంసాన్ని అనుభవిస్తున్న సిరియా ప్రజ శాంతిలేని మధ్యప్రాచ్యానికి సాక్షీ భూతంగా భగభగ మండుతూనే ఉంది. వందలు దాటి, వేలు గెంతి లక్షకు ఎగిసిన విగతులను తలచుకుంటూ సిరియా శిధిలాల మధ్య ఇంకా రోదిస్తూనే ఉంది. మూడేళ్ళ మైలు రాయిని చేరుకోవడానికి…

టెర్రరిస్టులకు ఐక్యరాజ్యసమితి మద్దతు? -సిరియా ప్రభుత్వం

ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ‘బాన్-కి-మూన్’ సిరియాలో విధ్వంసం సృష్టిస్తున్న టెర్రరిస్టులకు మద్దతు ఇచ్చేలా ప్రకటనలు జారీ చేయడం పట్ల సిరియా పత్రికలు ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నాయని ‘అసోసియేటెడ్ ప్రెస్’ ని ఉటంకిస్తూ ‘ది హిందూ’ తెలిపింది. సమితి అధిపతి తన విమర్శలను పూర్తిగా సిరియా ప్రభుత్వంపైనే కేంద్రీకరించడం ద్వారా టెరరిస్టుల హింసను ప్రోత్సహిస్తున్నాడని సిరియా పత్రికలు విమర్శలు ఎక్కుపెట్టాయి. మానవ బాంబులను ప్రయోగిస్తూ వేలమంది ప్రజలను బలి గొంటున్న టెర్రరిస్టు చర్యలను ఖండిస్తూ అంతర్జాతీయ సంస్ధలు…

సిరియాలో కాల్పుల విరమణ ప్రారంభం

సిరియాలో కాల్పుల విరమణ ప్రారంభం అయిందని బీబీసి తెలిపింది. సిరియా ప్రభుత్వం తన సైన్యాన్ని ఉద్రిక్త నగరాలనుండి ఉపసంహరించుకున్నదని తెలుస్తోంది. ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందం మేరకు సిరియా సైనికులు కాల్పుల విరమణను పాటిస్తున్నాయి. టెర్రరిస్టులు ప్రజలపైనా, ప్రజల ప్రభుత్వ ఆస్తులపైనా దాడులు దాడులు ప్రారంభించినట్లయితే తగిన విధంగా బదులు చెప్పకుండా ఉండబోమని సిరియా ప్రభుత్వం హెచ్చరించింది. మరోవైపు సిరియాలో ఇక ప్రజలు ఉవ్వెత్తున ఆందోళనలు చేపట్టాలని ప్రవాస…

సిరియా తరలి వెళ్ళిన రష్యా యుద్ధ నౌక ‘డిస్ట్రాయర్’

రష్యన్ నేవీ కి చెందిన యుద్ధ నౌక సిరియా ఓడ రేవు కి బయలుదేరినట్లు రష్యా మిలట్రీ అధికారులు తెలిపారు. గత వారాంతంలో నల్ల సముద్రంలోని సేవాస్టోపోల్  స్ధావరాన్ని డిస్ట్రాయర్ వదిలి వెళ్లిందని వారు తెలిపారు. మధ్యధరా సముద్రంలోని సిరియా ఓడరేవు ‘టార్టస్’ కు అది మరి కొద్ది రోజుల్లో చేరుకుంటుందని తెలుస్తోంది. ముందుగా అనుకున్న ‘మిలట్రీ డ్రిల్లు’ లో ‘డిస్ట్రాయర్’ పాల్గొంటుందని రష్యా మిలట్రీ ని ఉటంకిస్తూ ‘డి డెయిలీ స్టార్’ పత్రిక తెలిపింది. సిరియాలో…

మరో హత్యా కాండ, ఈ సారి సిరియాలో

ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా సైనికులు ఆఫ్ఘన్ పౌరులను ఊచకోత కోసిన రెండవ రోజే సిరియాలో పౌరుల ఊచకోత జరిగింది. సిరియాలో జొరబడి సంవత్సర కాలంగా అద్దె తిరుగుబాటు నడుపుతున్న పశ్చిమ దేశాల కిరాయి మూకలు తాజాగా ఈ హత్యా కాండకు పాల్పడ్డాయని సిరియా ప్రభూత్వ మీడియాను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. ఐక్యరాజ్య సమితి మాజీ అధ్యక్షుడు కోఫీ అన్నన్ సిరియా సందర్శిస్తున్న సందర్భంలో ఆయనను ప్రభావితం చేయడానికే విదేశీ కిరాయి మూకలు ఈ హత్యాకాండకి దిగాయని సిరియా…

సిరియా పై అమెరికా ఆశ, అడ్డుపడుతున్న రష్యా -కార్టూన్

– లిబియా ఆయిల్ ను వశం చేసుకున్న ఊపుతో అమెరికా, యూరప్ లు సిరియా లో అల్లర్లు సృష్టిస్తూ దాన్ని కూడా వశం చేసుకోవాలని చూస్తున్నాయి. కాని రష్యా, చైనాలు వాటికి అడ్డుపడుతున్నాయి. సిరియా లో జోక్యం చేసుకోవడానికి అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తుండగా ఐక్యరాజ్యసమితి భద్రతా సమితిలో రష్యా, చైనాలు తమ వీటో పవర్ తో ఆ ప్రయత్నాలను వమ్ము చేస్తున్నాయి.

మద్యధరా సముద్రంలో సిరియా సమీపాన మొహరించిన అమెరికా, రష్యా యుద్ధ నౌకలు

లిబియా విషయంలో పచ్చి అబద్ధాలు ప్రచారం చేసి, లేని తిరుగుబాటుకి సాయంగా సైనిక జోక్యం చేసుకుని చివరికి ఆ దేశ అధ్యక్షుడిని చంపి, ఆల్-ఖైదాతో కుమ్మక్కయ్యి మరీ తొత్తు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లు అదే తరహాలో సిరియాలో కూడా జోక్యం చేసుకోవడానికి అనేక కుట్రలు పన్నుతున్నాయి. అందులో భాగంగా అమెరికా ప్రవేశపెట్టిన అద్దె తిరుగుబాటుదారులే సిరియా ప్రజలపై కాల్పులు జరిపి పొట్టనబెట్టుకుంటున్నా, పశ్చిమ పత్రికలు రోజూ అనేక అబద్ధాలని సృష్టించి, సిరియా…

సిరియా అద్దె విప్లవకారులకు ఫ్రాన్సు మిలట్రీ ట్రైనింగ్

సిరియా నుండి పారిపోయి వచ్చిన అద్దె విప్లవకారులకి ఫ్రాన్సు ప్రభుత్వం రహస్యంగా మిలట్రీ ట్రైనింగ్ అందించనున్నట్లుగా ఫ్రాన్సు కి చెందిన వార పత్రిక “లె కెనార్డ్ ఎన్‌షైన్” వెల్లడించింది. ఆ పత్రిక ప్రకారం ఫ్రాన్సు ఏజెంట్లు ప్రస్తుతం లెబనాన్, టర్కీలలో తిష్ట వేసుకుని ఉన్నారు. “‘సిరియా స్వేచ్ఛా సైన్యం’ నిర్మాణానికి ప్రారంభ సైనిక బలగాలను నిర్మించడం” ఆ ఏజెంట్ల ముఖ్య లక్ష్యం. లిబియాలో సోకాల్డ్ తిరుగుబాటు ప్రారంభం కాకముందే అక్కడి తిరుగుబాటుదారులు అమెరికాలో శిక్షణ తీసుకున్నట్లుగానే సిరియా…