ఒక నిస్సహాయ పరిస్ధితి -ది హిందు ఎడ్..
[ఏప్రిల్ 26, 2016 తేదీన ది హిందూలో ప్రచురితం అయిన ఎడిటోరియల్ “A Desperate situation” కు యధాతధ అనువాదం] ********* మితి మీరిన భారం, సిబ్బంది లేమిలతో కూడిన భారతీయ న్యాయ వ్యవస్ధలో భారీ సంఖ్యలో కేసులు పెండింగ్ లో ఉండడం అందరూ ఎరిగిన విషయం. ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సమక్షంలో ప్రధాన న్యాయమూర్తి టి ఎస్ ఠాకూర్ భావావేశంతో చేసిన విజ్ఞాపన ఈ సమస్యకు తీవ్రతను, తక్షణమే దృష్టి పెట్టవలసిన ఆవశ్యకతను…