పోలీస్ చర్యతో సిడ్నీ సీజ్ అంతం -ఫోటోలు

సిడ్నీలో ఒక చాకోలేట్ కేఫ్ ను అదుపులో తీసుకున్న ఆగంతకుడు ఒకరు ఒక రోజంతా భయాందోళనలు సృష్టించాడు. కేఫ్ లో ఉన్న పౌరులను బందీలుగా ఉంచుకున్న సాయుధ వ్యక్తి డిమాండ్ లు ఏమీ చేయకపోవడం విశేషం. ఆగంతుకుడు ముస్లిం ఉగ్రవాదిగా పశ్చిమ పత్రికలు ప్రచారం చేశాయి. తీరా చూస్తే ఆ వ్యక్తి ఒక ఇరానియన్ ఆస్ట్రేలియన్ అనీ, తనపై దాఖలైన కేసుల్లో హై కోర్టు నిర్ణయం తనకు వ్యతిరేకంగా ఉండడంతో ఈ చర్యకు పాల్పడ్డాడని కొన్ని పత్రికలు…