జర్మనీ సిక్కులపై ఇండియా కోసం గూఢచర్యం, అరెస్టు!
ఆయన జర్మనీ దేశస్ధుడే. వయసు 58 యేళ్ళు, ఉద్యోగం ఇమిగ్రేషన్ ఆఫీస్ లో. తన ఉద్యోగం ద్వారా అందుబాటులో ఉన్న అవకాశాలను ఒక (పేరు వెల్లడి కాని) భారత ప్రభుత్వ గూఢచార సంస్ధ కోసం గూఢచర్యం చేస్తూ పట్టుబడిపోయాడు. విదేశీ గూఢచార సంస్ధల తరపున లేదా ఆ సంస్ధల కోసం గూఢచర్యం చేయడం జర్మనీలో నేరం. ఒక్క జర్మనీలోనే కాదు, ఏ దేశంలోనైనా అది నేరమే. జర్మనీలో అలాంటి వారికి కనీసం 10 యేళ్ళు జైలు శిక్ష…