నువ్వు పులివి, పులిలా పరుగెత్తు! -కార్టూన్

ప్రధాని మోడి: నూవ్వింకా వేగంగా పరుగెత్తాల్సి ఉంది. వాళ్లందరికీ నేను నువ్వు పులివి అని చెప్పి వస్తిని… ****************** సింగపూర్ లో భారత ప్రధాని చేసిన ప్రసంగం వింటే నోటిపై వేలు వేసుకోకుండా ఉండలేము. ఆయన తన మాటల మాయాజాలంతో ఆకాశంలో విహరింపజేస్తూ చెప్పింది ఏ ఇండియా గురించో అర్ధంకాక తలలు పట్టుకోకుండా ఉండలేము. తాము అధికారం చేపట్టిన 18 నెలలు గడిచాయో లేదో అప్పుడే భారత దేశం వెనకడుగు మానుకుని చుక్కల్లోకి దూసుకు పోతోందట! “ప్రపంచం…

నాట్లే ఇంకా కాలేదు, అన్నం కుక్కర్ రెడీ -కార్టూన్

కొత్త రాజధాని పేరుతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు చేస్తున్న హడావుడి చూస్తుంటే నవ్వాలో, ఏడ్వాలో తెలియని పరిస్ధితి. భూ సమీకరణకు సంబంధించి విధాన ప్రకటన ఇంతవరకు చేయలేదు. లక్ష ఎకరాల భూమి సేకరించేది ఏ ప్రయోజనాల కోసమో తెలీదు.భూములు ఇవ్వబోయే రైతులకు నష్టపరిహారం ఎంతో తెలీదు. భూములు లేక భూములు గలవారిపై ఆధారపడి బ్రతుకుతున్న లక్షలాది నిరుపేద కుటుంబాలకు బ్రతుకు తెరువు ఏమిటో కనీసం ఆలోచన కూడా చేయడం లేదు. భూములు ఇచ్చేందుకు ఎందరు…

సింగపూర్ హింస, 24 మంది భారతీయుల అరెస్టు

ప్రపంచంలో అత్యంత భద్రమైన దేశాల్లో ఒకటిగా పరిగణించే సింగపూర్ ఆదివారం దాడులు, దహనాలతో వార్తల్లో నిలిచింది. అల్లర్లకు కారకులంటూ సింగపూర్ ప్రభుత్వం 27 మందిని అరెస్టు చేయగా వారిలో 24 మంది భారతీయులే. నగర రాజ్యం (city state) గా పిలిచే సింగపూర్ ప్రధానంగా వలస కార్మికుల శ్రమ పైనే ఆధారపడే దేశం. భారత దేశం నుండి వలస వెళ్ళిన కార్మికుడు ఒకరిని బస్సు ఢీ కొట్టి చంపడంతో అల్లర్లు చెలరేగినట్లు పత్రికలు చెబుతున్నాయి. అయితే అల్లర్లకు…