అప్పు పరిమితి పెంచకపోతే అమెరికా దివాళా ఖాయం -మూడీస్
రిపబ్లికన్, డెమొక్రట్ పార్టీలు అమెరికా అప్పు పరిమితి పెంచే విషయంలో త్వరగా ఒక ఒప్పందానికి రాకపోతే అమెరికా దివాళా ఖాయమని మూడీస్ రేటింగ్ సంస్ధ హెచ్చరించింది. అమెరికా సావరిన్ అప్పు బాండ్లకు ప్రస్తుతం టాప్ రేటింగ్ ఉందనీ, ఇరు పార్టీలు త్వరగా ఒక అంగీకారానికి రావాలనీ లేకుంటే ఇపుడున్న టాప్ రేటింగ్ కోల్పోవాల్సి ఉంటుందనీ ఆ సంస్ధ హెచ్చరించింది. ప్రస్తుతం ట్రెజరీ బాండ్ల అమ్మకం ద్వారా అమెరికా ప్రభుత్వం సేకరించగల అప్పుపై 14.3 ట్రిలియన్ డాలర్ల మేరకు…