ప్రతిష్టంభనను కరిగించిన సార్క్ హ్యాండ్ షేక్ -కార్టూన్

ఇటీవల జరిగిన సార్క్ సమావేశాలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసిపోయాయి. ప్రాంతీయ సమగ్రత, ఐక్యతల కోసం అని చెబుతూ ఏర్పాటు చేసిన సార్క్ కూటమి సభ్య దేశాలు నిరంతరం ఒకరినొకరు తిట్టిపోసుకోవడంతోనే కాలం గడిపాయి తప్ప లక్ష్యం వైపు ప్రయాణిస్తున్నట్లు ఏనాడూ కనిపించలేదు. తన ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాల సారధులను ఆహ్వానించి ఆశలను చిగురింపజేసిన నరేంద్ర మోడి తీరా అసలు సార్క్ సమావేశాలకు వచ్చేసరికి తుస్సు మానిపించారు. సార్క్ లో ఇండియా, పాకిస్తాన్ లే అతి…

మోడి దౌత్య మర్యాద ఉల్లంఘించారు -నేపాల్ పత్రికలు

సార్క్ దేశాల కూటమి సమావేశాల సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడి దౌత్య మర్యాదలను ఉల్లంఘించారని నేపాల్ పత్రికలు ఆరోపించాయి. ఆయన తన పరిమితులు గుర్తెరగకుండా నేపాల్ రాజ్యాంగం ఎలా ఉండాలో సలహా ఇవ్వడం నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే అని విరుచుకుపడ్డాయి. పాత పెద్దన్న వైఖరి, జోక్యందారీ పెత్తనం సహించరానివని కాంతిపుర్, నాగరిక్ పత్రికలు విమర్శించాయి. నేపాల్ లో రాచరికాన్ని కూల్చివేసిన తర్వాత రాజ్యాంగ రచన ఇంకా పూర్తి కాలేదు. అనేక జాతుల సంగమం…

భారత ప్రధానికి బోలెడు ఉపగ్రహాలు -కార్టూన్

“శ్రీలంక నుండి అప్రమత్తత సంకేతమా? కాస్త ఆగండి. నేను చెన్నైలోని మా ప్రాంతీయ ఉపగ్రహం నుండి వివరాల కోసం ఎదురు చూస్తున్నాను.” ********* భారత ప్రధాని నరేంద్ర మోడీకి బోలెడు ఉపగ్రహాలు. ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాధినేతలను పిలిపించుకుని (సో కాల్డ్) ‘చరిత్ర సృష్టించడం’ ద్వారా భారత పెద్దన్న పాత్రను ఆదిలోనే రుజువు చేశారు ప్రధాని. ఆ చర్యతో భారతేతర సార్క్ దేశాలు ఇండియా ఉపగ్రహాలన్న అభిప్రాయం ఒకటి అంతర్జాతీయ పరిశీలకులకు ఏర్పడిపోయింది. ప్రధాని మోడి దేశీయంగా…

ప్రమాణానికి ముందే ఆఫ్ఘన్ తో చర్చలు చేసిన మోడి

మాట్లాడితే ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ లపై విద్వేషం వెళ్లగక్కే మోడి అభిమానులు, ప్రధానిగా మోడి తీసుకుంటున్న చర్యలను ఏ విధంగా అర్ధం చేసుకుంటారన్నదీ పరిశీలించాల్సిన విషయం. భారత దేశానికి శత్రు దేశాలయిన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లతో సత్సంబంధాలను మీరు ఎలా కోరుకుంటారో అర్ధం కావట్లేదు అని ఒక హిందూత్వ అభిమాని ఈ బ్లాగ్ రచయితను ప్రశ్నించిన సంగతి ఇటీవలి విషయమే. అయితే మోడి ప్రధాన మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయకమునుపే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్ధాన్ రెండు దేశాలతోనూ చర్చలు…

పరిభాష తెలిస్తే తేలికే -ఈనాడు ఆర్టికల్ 3వ భాగం

“జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాంధించడమెలా?” ఆర్టికల్ మూడవ భాగం ఈనాడు చదువు పేజిలో ఈ రోజు ప్రచురించబడింది. బ్లాగ్ పాఠకుల కోసం ఇక్కడ ఇస్తున్నాను. బొమ్మపైన క్లిక్ చేస్తే పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ రూపంలో ఆర్టికల్ చూడవచ్చు. ఈనాడు వెబ్ సైట్ లో చూడదలిచినవారు ఈ లింక్ క్లిక్ చేయగలరు.