ప్రతిష్టంభనను కరిగించిన సార్క్ హ్యాండ్ షేక్ -కార్టూన్

ఇటీవల జరిగిన సార్క్ సమావేశాలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసిపోయాయి. ప్రాంతీయ సమగ్రత, ఐక్యతల కోసం అని చెబుతూ ఏర్పాటు చేసిన సార్క్ కూటమి సభ్య దేశాలు నిరంతరం ఒకరినొకరు తిట్టిపోసుకోవడంతోనే కాలం గడిపాయి తప్ప లక్ష్యం వైపు ప్రయాణిస్తున్నట్లు ఏనాడూ కనిపించలేదు. తన ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాల సారధులను ఆహ్వానించి ఆశలను చిగురింపజేసిన నరేంద్ర మోడి తీరా అసలు సార్క్ సమావేశాలకు వచ్చేసరికి తుస్సు మానిపించారు. సార్క్ లో ఇండియా, పాకిస్తాన్ లే అతి…