ఏఎఫ్ఎస్పిఏ కింద శిక్షలేమికి ముగింపు -ద హిందూ ఎడిట్..
[Ending impunity under AFSPA శీర్షికన ఈ రోజు -11/07/2016- ద హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం. -విశేఖర్] “జవాబుదారితనం, చట్టబద్ధ సూత్రాలకు ఒక పార్శ్వం.” విధి నిర్వహణ పేరుతో “కల్లోలిత ప్రాంతాలలో” కూడా, భద్రతా బలగాలు పాల్పడే అతి చర్యలపై జరగవలసిన దర్యాప్తు నుండి తప్పించుకోజాలరని సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగు దరిమిలా ఈ స్థాపిత సూత్రం తాజాగా ప్రాధాన్యత సంతరించుకుంది. అటువంటి నోటిఫైడ్ ప్రాంతాల్లో భద్రతా బలగాలు తమ “ప్రత్యేక అధికారాలు” ఉపయోగించినప్పుడు చట్టబద్ధ…