పనామా పేపర్స్: అమెరికా ఫైనాన్స్ ప్రయోజనాలే లక్ష్యం -4

(3వ భాగం తరువాత………..) అమెరికా ఫైనాన్స్ కంపెనీలే లబ్దిదారులు ఒక నేరం జరిగినప్పుడు పోలీసులు లేదా నేర విచారణ సంస్థలు ఒక అంశంపై తప్పనిసరిగా దృష్టి పెడతాయి. ఆ నేరం వల్ల లబ్ది పొందేది ఎవరు? అని ప్రశ్నించుకుంటారు. ఆ ప్రశ్నకు సమాధానం దొరికితే నేర విచారణ అనేక కేసుల్లో పూర్తయి పోతుంది. అనేకానేకానేక పరిణామాలు నిత్యం విడివిడిగా, జమిలిగా చోటు చేసుకునే ప్రపంచ కార్యరంగంలో చోటు చేసుకునే పరిణామాలకు కారణాలు కనిపెట్టడం మామూలు కంటికి కష్ట…