నిశ్శబ్దం ఒక ఎంపిక కాదు -ది హిందు ఎడిటోరియల్

అమెరికా అధ్యక్షుడు బారక్ బారక్ ఒబామా, ఇండియాలో కుంచించుకుపోతున్న మత సామరస్యం గురించి తొమ్మిది రోజుల వ్యవధిలో రెండుసార్లు వరుసగా ప్రకటనలు గుప్పించడంపై ఇండియాలో కాస్త తత్తరపాటును సృష్టించింది. మొదటి సారి జనవరి 27 తేదీన తన భారత సందర్శనను ముగిస్తూ మత ప్రాతిపదికన లోలోపల విభజనకు గురైన దేశాలు ఎన్నటికీ ప్రగతి సాధించలేవన్న అంశాన్ని ఒబామా నొక్కి చెప్పారు; రెండోసారి ఫిబ్రవరి 5 తేదీన మాట్లాడుతూ ఆయన భారత దేశం నుండి వెలువడుతున్న మత అసహనం…