క్రికెట్ లో కోహ్లీ, బాలీవుడ్ లో అమీర్ ఖాన్… భళా!

బాలీవుడ్ హీరోలు కూడా నేల మీద నిలబడవచ్చనీ/గలరనీ, ప్రజల సమస్యల పైన స్పందించవచ్చని/గలరనీ నిరూపించిన, నిరూపిస్తున్న హీరోల్లో ఒకరు అమీర్ ఖాన్! అమీర్ ఖాన్ కాకుండా జనానికి సంబంధించిన రోజువారీ సమస్యలపైన సానుకూలంగా, ప్రగతిశీలకరంగా స్పందించగల ఖరీదైన సెలబ్రిటీలు ఇండియాలో దాదాపు ఇంకెవరూ లేరని ఘంటాపధంగా చెప్పవచ్చు. క్రికెటర్లలో విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోలలో అమీర్ ఖాన్ కాస్త వినమ్రంగా ఉంటారు. హేతుబద్ధంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తారు. పెద్దగా బడాయిలకు పోకుండా దేశం కోసం ఆడుతున్నట్లు, ప్రేక్షకులు లేకపోతే…

రేప్డ్ వుమెన్ తో సల్మాన్ పోలిక ఎందుకు తప్పు?

సల్మాన్ ఖాన్ మరో వివాదానికి తెర తీశాడు. సుల్తాన్ సినిమా చిత్రీకరణ సందర్భంగా తాను ఎదుర్కొన్న నెప్పి, బాధ, అలసట, హూనం… ఇత్యాది భౌతిక అనుభవాలను అభివర్ణించటానికి అనూహ్యమైన, ఖండనార్హమైన పోలికను తెచ్చాడు. దానితో మరో సారి దేశవ్యాపితంగా సల్మాన్ కు వ్యతిరేకంగా, అనుకూలంగా వాద ప్రతి వాదాలు చెలరేగాయి. పత్రికలకు మరో హాట్ టాపిక్ లభించింది. చానెళ్లకు మరొక ప్రైమ్ టైమ్ చర్చాంశం అంది వచ్చింది. చర్చల మెదళ్ళకు, టి.వి యాంకర్లకు మేత దొరికింది. ట్విట్టర్…

సల్మాన్ కో న్యాయం, అఫ్జల్ కో న్యాయం! -2

“అప్పీలుదారు ఎలాంటి అనుమానం లేకుండా దోషియే అని నిర్ధారించ గల స్ధాయిలో ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టిన సాక్ష్యం, ఈ కోర్టు దృష్టిలో, లేదు. అనుమానం అన్నది, అది ఎంత బలంగా ఉన్నప్పటికీ, ఎవరినైనా సరే దోషిగా నిర్ధారించడానికి సరిపోదు. “కీలక సాక్ష్యాలను నమోదు చేయక పోవడంలో ప్రాసిక్యూషన్ లో లోపాలు ఉన్నాయి. గాయపడిన వారి సాక్ష్యాలలో విడుపులు (omissions), వైరుధ్యాలు ఉన్నాయి. సాక్ష్యాల సేకరణలో దొర్లినట్లుగా కనిపిస్తున్న లొసుగులు నిందితునికే లాభం చేకూర్చుతాయి. “ప్రజల అభిప్రాయం ఏమిటో మాకు…

సల్మాన్ కొక న్యాయం, అఫ్జల్ కొక న్యాయం?! -1

భారత దేశ పార్లమెంటరీ రాజకీయార్ధిక వ్యవస్ధను కంటికి రెప్పలా కాపాడుతున్న భారతీయ కోర్టులు తాము, రాజ్యాంగ చట్టాలు చెబుతున్నట్లుగా, అందరికీ ఒకటే న్యాయం అమలు చేయడం లేదని మరోసారి రుజువు చేసుకున్నాయి. సల్మాన్ ఖాన్ హిట్ & రన్ కేసు విషయంలో అంతిమ తీర్పు ప్రకటిస్తూ ముంబై హై కోర్టు చేసిన వ్యాఖ్యలు, పొందుపరిచిన సూత్రాలకూ అఫ్జల్ గురు కేసు విషయంలో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు, సూత్రాలకూ మధ్య తేడాను గమనిస్తే ఈ సంగతి తేలికగా…

ది హిందులో పరస్పర విరుద్ధ కార్టూన్లు

టాపిక్ ఒకటే. కార్టూనిస్టు కూడా ఒకరే. కానీ మూడు రోజుల వ్యవధిలో రెండు పరస్పర విరుద్ధ కార్టూన్లను ది హిందు పత్రిక ప్రచురించింది. సల్మాన్ ఖాన్ జైలు పాలు కావడం కార్టూన్ లలోని అంశం. ఒక కార్టూన్ సల్మాన్ ఖాన్ కు విధించిన శిక్ష గురించి వ్యాఖ్యానిస్తే, మరొక కార్టూన్ ఆయన బెయిలుపై విడుదల కావడంపై వ్యాఖ్యానించింది. మొదటి కార్టూన్ చూడండి. ఇది మే 7 తేదీన ప్రచురితం అయింది. ఇందులో భారత దేశ న్యాయ వ్యవస్ధ…