మాయావతి (బి.ఎస్.పి) ప్రయాణం -కార్టూన్

ఉత్తర ప్రదేశ్ లో బహుజన్ సమాజ్ పార్టీ ప్రయాణం ఒక వింత రూపాన్ని సంతరించుకుంది. ఆ పార్టీ వ్యవస్ధాపకుడు కాన్షీరామ్ బతికి ఉంటే ఎలా ఉండేదో గానీ పార్టీ స్ధాపన సమయంలో ఆయన  చెప్పిన సిద్ధాంతాలకు చెదలు పట్టాయి. ఈ చెదలకు సైద్ధాంతీక పోషకత్వం స్వయంగా కాన్షీరామ్ వారసురాలు మాయావతియే కావడం ఒక విపరిణామం. భూస్వామ్య కులాల వలలో చిక్కిన కొద్దిమంది ఉప నాయకులు పార్టీ వ్యవస్ధాపాక సిద్ధాంతాలతో విభేదించి పార్టీని చీల్చి అగ్రకుల భూస్వామ్యులతో కలిసిపోతే…