మోడీకి పటేల్ ఆమోదం ఉండేది కాదు -పటేల్ బయోగ్రాఫర్

బి.జె.పి ప్రధాని పదవి అభ్యర్ధి నరేంద్ర మోడీని సర్దార్ పటేల్ తన వారసుడిగా ఆమోదించి ఉండేవారు కాదని పటేల్ జీవిత చరిత్ర రచయిత రాజ్ మోహన్ గాంధీ వ్యాఖ్యానించారు. సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ నిర్వహించే ‘డెవిల్స్ అడ్వొకేట్’ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్ మోహన్ గాంధీ మోడిని తన సైద్ధాంతిక వారసునిగా ఆమోదించకపోగా ముస్లింల పట్ల ఆయన వ్యవహరించిన తీరుపట్ల ఎంతో ఆవేదన చెందేవారని స్పష్టం చేశారు. మహాత్మా గాంధీకి మనవడు కూడా అయిన రాజ్ మోహన్ గాంధీ భారత దేశ…

అగ్రరాజ్య హోదా అంటే లిబర్టీ విగ్రహాన్ని అనుకరించడమా? -కార్టూన్

– “అవి మన మన్ హట్టన్…. ఆకాశహర్మ్య విగ్రహాలు” – అక్టోబర్ 29 తేదీన కేంద్ర ప్రభుత్వ నిధులతో సర్దార్ పటేల్ మెమోరియల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మ్యూజియం ప్రారంభం అయితే, అక్టోబర్ 31 తేదీన గుజరాత్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పటేల్ విగ్రహ నిర్మాణానికి శంకుస్ధాపన జరిగింది. గుజరాత్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అంటే నరేంద్ర మోడి ఆధ్వర్యంలో అనుకోవాలి. ఆయన నిర్మించబోయే పటేల్ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం అవుతుందట. న్యూయార్క్ నగరంలోని మన్ హటన్…

పటేల్ విగ్రహానికి కాణీ విదల్చని మోడి

దేశంలోని ఛానెళ్ల నిండా సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహ నిర్మాణం గురించి ప్రకటనల రూపంలో మారుమోగి పోతోంది. పటేల్ విగ్రహంతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి బొమ్మ కూడా ఆ ప్రకటనల్లో కనిపిస్తోంది. విగ్రహ నిర్మాణం మొత్తం ఆది నుంచి అంతం వరకూ తానే నెత్తి మీద వేసుకుని మోస్తున్నట్లుగా సదరు ప్రకటనల్లో మోడి బిల్డప్ ఇస్తున్నారు. తీరా చూడబోతే ఈ మెమోరియల్ నిర్మాణం కోసం తన పదేళ్ళ పాలనలో నరేంద్ర మోడి ఒక్క…