సర్జికల్ స్ట్రైక్: దిష్టి బొమ్మదే క్రెడిట్! -కార్టూన్
“ఛాతీలు గుద్దుకోవద్దని ప్రధాని మోడీ ఆదేశించారు.” వారం పది రోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశం నుండి బైటికి వచ్చాక కేబినెట్ మంత్రులు చెప్పిన మాట ఇది. కానీ అప్పటి నుండి ఛాతీలు గుద్దుకోవడం, భుజాలు చరుచుకోవడం పెరిగిందే గానీ తగ్గలేదు. నిన్నటికి నిన్న రక్షణ మంత్రి మనోహర్ పర్రికర్ తన ఛాతీ తాను గుద్దు కోవడంలో కొత్త పుంతలు తొక్కారు. ఆయన తెలివిగా తనతో పాటు ప్రధాని మోడీని కూడా కలిపి సర్జికల్ స్ట్రైక్స్…