వ్యాక్సిన్: ప్రజల కంపెనీల్ని మూలకు తోసి ప్రైవేటుని మేపుతున్నారు!

ప్రజల కంపెనీలు అంటే పబ్లిక్ సెక్టార్ కంపెనీలు అని. వ్యాక్సిన్ల తయారీలో భారత దేశం పేరెన్నిక గన్నది. ప్రభుత్వ రంగంలో వ్యాక్సిన్ పరిశోధన మరియు తయారీ కంపెనీలను స్ధాపించి నిర్వహించడంలో భారత దేశానికి పెద్ద చరిత్రే ఉన్నది. ఎల్‌పి‌జి (లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ విధానాలను చేపట్టిన ఫలితంగా ఈ ప్రజల/ప్రభుత్వ కంపెనీలను ఒక్కటొక్కటిగా మూసివేస్తూ వచ్చారు. దానితో వ్యాక్సిన్ తయారీలో స్వయం సమృద్ధ దేశంగా ఉన్న భారత దేశం ఇప్పుడు పరాధీన దేశంగా మారిపోయింది. విదేశీ ప్రైవేటు…

అమెరికాలో మన ఐ.టి ఉద్యోగులకు 6 రెట్లు తక్కువ జీతం

ప్రపంచ ఐ.టి ఉత్పత్తులకు కేంద్రంగా పేరు పొందిన సిలికాన్ వాలీ (అమెరికా) లో ఓ కంపెనీ, ఇండియా నుండి వచ్చిన ఐ.టి ఉద్యోగులకు అమెరికా ఉద్యోగుల కంటే 6 రెట్లు తక్కువ వేతనం చెల్లిస్తోంది. బెంగుళూరు నుండి తెచ్చుకున్న భారతీయ ఐ.టి ఉద్యోగుల పట్ల చూపుతున్న ఈ వివక్ష గురించి అజ్ఞాత వ్యక్తుల ద్వారా ఫిర్యాదు అందుకున్న లేబర్ డిపార్టుమెంటు వారు తనిఖీ చేసి ఫిర్యాదు నిజమే అని తెలుసుకున్నారు. భారీ తేడాతో తక్కువ వేతనం చెల్లించడమే…

ప్రశ్న: సరళీకరణ విధానాలు దేశానికి మంచివే కదా?

హరీష్: ఇవాళ ప్రభాత్ పట్నాయక్ గారి ఇంటర్వ్యూ ఈనాడులో ప్రచురించారు. సరళీకరణ వల్ల  ఆర్ధిక అసమానతలు పెరిగాయని ఆయన వివరించారు. కాని ఆ సరళీకరణ విదానాల వల్లనే మనం ఆర్థికంగా మెరుగయ్యామని చెప్తుంటారు కదా. మేమూ అలానే అనుకుంటున్నాం. చాలా  మంది కొత్తవాళ్ళకి అవకాశాలు అందించాయి  కదండి. దాని గురుంచి కాస్త విపులంగా వివరించగలరు. సమాధానం: ప్రభాత్ పట్నాయక్ గారు చెప్పింది నిజమే. సరళీకరణ విధానాలు ప్రజల కోసం ప్రవేశపెట్టినవి కావు. భారత దేశ మార్కెట్ ను…

రూపాయి: చేతకాకపోతే సరి! -కార్టూన్

“ఏం భయపడొద్దు. అది మరింత జారిపోకుండా ఎక్కడో ఒకచోట ఆగి తీరాల్సిందే!” – “రూపాయిన పతనం కానివ్వం.”అడిగినప్పుడల్లా ప్రధాని, ఆర్ధిక మంత్రులు చెప్పే మాట ఇది. ఒక పక్క పతనం అవుతూనే ఉంటుంది. వీళ్ళేమో మీడియా సెంటర్లో కూర్చుని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతుంటారు. అదేమని అడిగితే “ఇక్కడ అంతా బాగానే ఉంది. విదేశాల్లో పరిస్ధితుల్ని మనం నియంత్రించలేము కదా?” అని చిలక పలుకులు పలుకుతున్నారు. అసలు విదేశాల్లో పరిస్ధితి బాగోలేకపోతే ఆ ప్రభావం మనమీద ఎందుకు…

పోస్కో వ్యతిరేక ఆందోళన తీవ్రతరం, పిల్లలు మహిళలతో మూడంచెల ప్రతిఘటన వ్యూహం

ఒడిషాలొని జగత్‌సింగ్ పూర్ జిల్లాలో పోస్కో ఉక్కు ఫ్యాక్టరీ కోసం బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ గ్రామాల ప్రజలు చేస్తున్న పోరాటం కీలక దశకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం 24 ప్లాటూన్ల పోలీసు బలగాలను దించి ధింకియా, గోవింద్ పూర్ గ్రామాలను బహుళజాతి ఉక్కు కంపెనీ కోసం వశం చేసుకోవడానికి ప్రయత్నాలను తీవ్ర్రం చేసింది. దాదాపు 3000 ఎకరాల్లోని అటవీ భూముల్ని పోస్కోకి కట్టబెట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిని ఇచ్చేశాయి. ఈ భూముల్లోని అడవులపైనే అక్కడ ఉన్న…

బడ్జెట్ 2011-12 -సామాన్యుడికి మొండిచేయి, మార్కెట్ కి అభయ హస్తం

  భారత ప్రభుత్వ ఆర్ధిక నడక, మార్కెట్ ఎకానమీ వైపుకు వడివడిగా సాగిపోతోంది. బహుళజాతి సంస్ధల నుండి మధ్య తరగతి ఉద్యోగి వరకు ఎదురు చూసిన “బడ్జెట్ 2011-12” ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఫిబ్రవరి 28, 2011 తేదీన పార్లమెంటులో ఆవిష్కరించారు. ఎప్పటిలానే యూనియన్ బడ్జెట్ సామాన్యుడిని పట్టించుకుంటున్నట్లు నటిస్తూ, మార్కెట్ లో ప్రధాన పాత్రధారులైన స్వదేశీ ప్రైవేటు పెట్టుబడిదారుల నుండి విదేశీ బహుళజాతి సంస్ధల వరకు భారత దేశ కార్మికులూ, రైతులూ, ఉద్యోగుల రెక్కల…