సరబ్ జిత్ లాగే మాకూ డబ్బివ్వాలి, కోర్టుకు గూఢచారుల మొర
ఇంతకీ సరబ్ జిత్ సింగ్ ఎవరు? పాకిస్ధాన్ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లు టెర్రరిస్టా? ఆయన కుటుంబం చెబుతున్నట్లు తాగి ఏమి చేస్తున్నాడో, ఎటు వెళుతున్నాడో తెలియని అమాయక తాగుబోతా? భారత ప్రభుత్వం సొంతం చేసుకోలేని గూఢచారా? భారత పత్రికలు సరబ్ జిత్ సింగ్ గురించి అతని కుటుంబ సభ్యులు చెప్పిన ‘అమాయక తాగుబోతు’ కధని వల్లించినప్పటికీ బి.బి.సి, సి.ఎన్.ఎన్ లాంటి పశ్చిమ దేశాల పత్రికలు ఆయనను భారత గూఢచారి అనే సంబోధిస్తూ వచ్చాయి. ది హిందు పత్రిక ఆదివారం…