6గురు ఎం.పిల బహిష్కరణ, లోక్ సభకే బిల్లు

ప్రతిపక్ష బి.జె.పి విమర్శలు తమ ద్వంద్వ ఎత్తుగడలను ఉతికి ఆరబెట్టడంతో కాంగ్రెస్ సవరణలకు దిగింది. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన ఆరుగురు కాంగ్రెస్ ఎం.పిలను పార్టీ నుండి బహిష్కరించింది. తద్వారా తెలంగాణ బిల్లు విషయంలో తాను సీరియస్ గా ఉన్నానని చెప్పే ప్రయత్నం చేసింది. బిల్లును మొదట రాజ్యసభలో పెడతామని చెప్పిన ప్రభుత్వం న్యాయశాఖ సలహాతో రూటు మార్చుకుని లోక్ సభలో పెట్టడానికి నిర్ణయించుకుంది. 6గురు కాంగ్రెస్ ఎం.పి లు అమరవీరులుగా ఛానెళ్ల ముందు నిలబడుతుండగా,…

ఎవడు లాగితే లగడపాటి కిందపడతాడో…

“… వాడే నిజమైన తెలంగాణ వాది” అని అంటోంది డెక్కన్ టి.వి. జనవరి 22 తేదీ హైద్రాబాద్ లో జరిగిన సీమాంధ్ర ధర్నాలో లగడపాటి రాజగోపాల్ కు అవమానం జరిగింది. వేదికపై ప్రసంగిస్తున్న లగడపాటిని తెలంగాణకు చెందిన యువకుడు ఒకరు కిందకు లాగేయడంతో ఆయన కింద పడిపోయారు. ఈ సంఘటన పట్ల తెలంగాణ వాదులు సంతోషంతో హర్షం ప్రకటిస్తుంటే సీమాంధ్ర లేదా సమైక్య ఉద్యమకారులు విమర్శలు కురిపిస్తున్నారు. మొదట ఛలో అసెంబ్లీ అని ప్రకటించిన ఏ.పి.ఎన్.జి.ఓ సంస్ధ…

రాష్ట్ర విభజన: గతితర్క వివరణ –కార్టూన్

రాహుల్ గాంధీకి ప్రధాని పదవిని పళ్లెంలో పెట్టి అప్పగించడానికే సోనియా గాంధీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనకు తలపెట్టిందని కానీ సీమాంధ్ర ఉద్యమం వలన అది ఆమెకు కష్టంగా మారిందని ఈ కార్టూన్ సూచిస్తోంది. రాష్ట్రాన్ని విభజించిన తర్వాత టి.ఆర్.ఎస్ తో పొత్తు లేదా విలీనం ద్వారా తెలంగాణలో, వైకాపాతో పొత్తు లేదా విలీనం లేదా ఎన్నికల అనంతర కూటమి ద్వారా సీమాంధ్రలోనూ మెజారిటీ లోక్ సభ స్ధానాలను గెలుచుకోవచ్చని, తద్వారా రాహుల్ గాంధీ ని ప్రధానిగా…

ఓ సమైక్య మిత్రుడి ఆక్రోశం!

ప్రొద్దుటూరి అప్పారావు గారి వ్యాఖ్య ఇది. ‘పిట్ట కధ: తెలంగాణ – నదిలో దుప్పటి’ అన్న టపా కింద రాశారు. ఆంగ్లంలో రాసిన వ్యాఖ్యను తెనుగీకరించి ప్రచురిస్తున్నాను. మనం సమైక్యాంధ్ర కోసం పోరాడొచ్చు. కానీ మార్గం సరైనది కాదు. రాజకీయ నాయకులు (ఎం.ఎల్.ఏలు, ఎం.పిలు) అందరూ తమ జీత భత్యాలను వినియోగించుకుంటున్నారు. ఒక ఎం.పి గారు (ఉద్యమంలో) పాల్గొంటూనే తిరుమల ఛైర్మన్ గా పదవిని అనుభవిస్తున్నారు. రాజకీయ నాయకుల వ్యాపారాలన్నీ ఆటంకం లేకుండా చక్కగా నడుస్తూనే ఉన్నాయి.…

తెలంగాణ షో -కార్టూన్

కాంగ్రెస్ పార్టీ ఎలాగో ధైర్యం చేసి తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆ పార్టీని ఎక్కడ ముంచి ఎక్కడ తేల్చనున్నదో తెలియని పరిస్ధితి. అధిష్టానం మాటకు కట్టుబడి ఉంటామని చెప్పిన పెద్ద మనుషులంతా ఆ మాట తీసి గట్టున పెట్టి తలో దారి పడుతున్నారు. సీమాంధ్ర జనం కోసం రాజీనామాలు నటించలేక అలాగని పార్టీలో కొనసాగుతూ ప్రజల ఆగ్రహానికి నిలవలేక ఆపసోపాలు పడుతున్నారు. తెలంగాణ మ్యాజిక్ ద్వారా ‘anti-incumbency’ ఫ్యాక్టర్ ని ఎదుర్కోవచ్చని కాంగ్రెస్ భావించిన…

పిట్ట కధ: తెలంగాణ – నదిలో దుప్పటి

విజయనగరంలో ‘కనిపిస్తే కాల్చివేత’ ఉత్తర్వులు జారీ అయ్యాయని ది హిందు పత్రిక ఒక వార్త ప్రచురించింది. ఆ వార్త కింద సయ్యద్ మునిరుద్దీన్ అనే ఒక పాఠకుడు వ్యాఖ్యానంగా ఈ కింది పిట్టకధ రాశారు. ఈ పిట్టకధని ఆయన చిన్నప్పుడు విన్నారట. తెలంగాణ-సమైక్యాంధ్ర ఉద్యమాలను చూసి తనకా కధ గుర్తుకొస్తోంది అని చెబుతూ రాశారు. చాలా తమాషాగా ఉంది చదవండి! అనగనగా ఇద్దరు మిత్రులు ఉండేవారు. వారు ఒక రోజు ఒక నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్నారు.…

విజయనగరంలో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో భాగంగా కేంద్ర కేబినెట్, నోట్ ఆమోదించడానికి నిరసనగా విజయ నగరం అట్టుడుకుతోంది. ఏ.పి.ఎన్.జి.ఓ సంఘం ఇచ్చిన 48 గంటల బంద్ పిలుపు ముగిసినప్పటికీ మూడో రోజు కూడా అక్కడ ప్రజలు ఆగ్రహంతో వీధులకెక్కారు. కర్ఫ్యూ ప్రకటించినప్పటికి పరిస్ధితి అదుపులోకి రాకపోవడంతో ‘కనిపిస్తే కాల్చివేత’ ఉత్తర్వులు జారీ అయినట్లు ది హిందు తెలిపింది. ప్రజల ఆగ్రహం ప్రధానంగా రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణపై కేంద్రీకృతం అయింది. పి.సి.సి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సోనియా…

సి.బి.ఐ సుత్తితో బాది సానపెడితే, ఆ కత్తే వైకాపా -కార్టూన్

ఈ కార్టూన్ చూసి నవ్వని, కనీసం నవ్వుకోని వారు ఎవరన్నా ఉంటే వారికి ఏదో సమస్య ఉన్నట్లే అనుకోవాలి. ‘మాట తప్పని, మడమ తిప్పని’ వంశం అని చెప్పుకున్నవారు సోనియాగాంధీ కాళ్ళు పట్టుకుని బెయిల్ ఇప్పించుకున్నారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక పక్క ఆరోపిస్తున్నారు. టి.డి.పి నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి అయితే ఒకడుగు ముందుకేసి వై.ఎస్.ఆర్ భార్య వై.ఎస్.విజయ నిన్న సోనియాగాంధీకి ఫోన్ చేసి ‘బెయిల్’ ఇప్పించినందుకు ధన్యవాదాలు కూడా చెప్పారని ఆరోపించారు. అదే నిజమైతే…

సమైక్యగీతిక అనబడు బిస్కెట్టు కవిత

(రచన: అవ్వారి నాగరాజు) ఈ రోజు ముఖంలో ముఖం పెట్టి అంటోంది ప్రేమించవేం ప్రియా ? “సమైక్యం” గా ఉందామని ఫ్రెండ్స్, మనకిక పాట కావాలి ఒక ధూమ్ ధాం లాగా ఒక గద్దర్ గోరటోని లాగా అన్నీ కుదిరాయి కానీ అదొక్కటే కదా ఇక- చచ్చుపుచ్చు గెంతులు గావుకేకలూ వయస్సు మళ్ళీ ఎముకలు కుళ్ళీ ఒక్కటీ ఇమడక జవజవలాడక తెర మీద ప్రణయం మాదిరి ఒక చేత యాసిడ్ సీసా మరో చేత వేట కొడవలి…

సీమాంధ్ర ఉద్యమానిది కేవలం సెంటిమెంటు కాదు

(ఇది అవ్వారి నాగరాజు గారి వ్యాఖ్య.) తెలంగాణాకు అనుకూలంగా నేనూ, వ్యతిరేకంగా నా మిత్రులూ మాట్లాడుకుంటున్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. వాటిని పాఠకులతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఇది రాస్తున్నాను. నా మిత్రుల వాదనలలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినవి నదీ జలాలను పంచుకోవడం, కొత్త రాష్ట్రాన్నీ, కొత్త రాజధానినీ నిర్మించుకోవడానికి కావలసిన నిధులు, ఆదాయాలూ- ఆస్తులూ వాటి పంపకాలూ ప్రస్తావనకు వచ్చాయి. నదీ జలాల విషయం ఒక్కొక్క నదినీ సోదాహరణంగా తీసుకొని అవి కేవలం ఒక్క…

ఓ సమైక్య మొగుడి ఆధిపత్యం చూసి తీరాలి -వీడియో

రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్ధితులకు ఈ వీడియో చక్కగా అద్దం పడుతోంది. సంసారంలో భార్యా, భర్తలు ఇద్దరూ సమానం అయితేనే అది సజావుగా నడుస్తుంది.  కానీ పురుషాధిక్య సమాజంలో స్త్రీ, పురుష సమానత్వం అనేక సందర్భాల్లో డొల్లగా మారిపోయింది. చట్టాలు పురుషాధిక్యతను తిరస్కరిస్తున్నట్లు చెబుతాయి. స్త్రీలపై జరిగే అన్యాయాలను అరికట్టడానికే కంకణం కట్టుకున్నట్లు బల్లలు గుద్దుతాయి. కానీ అమలు విషయంలో అదంతా నాటకం అని తేలిపోతుంది. ఆచరణలోకి వచ్చేసరికి అమలు చేయాల్సింది మళ్ళీ ఆ పురుషులే, లేదా పురుషాధిక్య…

సమైక్యాంధ్ర ఉద్యమం చల్లారాలంటే… ?

(moola) ప్రశ్న:  సమైక్యాంధ్ర ఉద్యమం చల్లారంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? సమాధానం: కేంద్రం దృష్టిలో ప్రజల సమస్యలు పరిష్కరించడమే ప్రధమ కర్తవ్యంగా ఉంటే ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం చాలా తేలిక. కానీ కేంద్రాన్ని ఏలుతున్న పాలకవర్గాల ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేక దిశలో ఉన్నాయి. కాబట్టి మనం అనుకునే పరిష్కారం వారు ఇవ్వరు. వారు చూపే ఉద్యమ అణచివేత పరిష్కారం ప్రజలకి సానుకూలం కాదు. పాలక వర్గాలు అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలే ప్రజలకు ఒక…

టి.డి.పి, వైకాపాలే తెలంగాణకు కారణం -కాంగ్రెస్ మంత్రులు

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రాంత మంత్రులు, ఎమ్మేల్యేలు, నాయకులు ఒక విచిత్ర వాదన ముందుకు తెచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం వారి దృష్టిలో తెలంగాణకు కారకులు కాదు. తెలుగుదేశం, వైకాపాలు తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు ఇవ్వడం వల్లనే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ప్రకటించింది తప్ప వారికి ఇవ్వాలని ఏ కోశానా లేదు. టి.డి.పి, వైకాపాల లేఖలకు, రాష్ట్ర విభజనకు నిరసనగా తాము రాజీనామాలు చేయడానికి నిర్ణయించుకున్నామని కాంగ్రెస్ మంత్రులు,…

తెలంగాణ: ఆం.ప్ర ఉభయ సభల అభిప్రాయం తప్పనిసరి -నిపుణులు

తెలంగాణ రాష్ట్ర విభజన కోసం ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి శాసన సభ మరియు విధాన సభలు రెండు తమ తమ అభిప్రాయాలు చెప్పడం తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ అభిప్రాయాలను తప్పనిసరిగా పాటించవలసిన అవసరం పార్లమెంటుకు లేదని కూడా వారు చెబుతున్నారు. లగడపాటి రాజగోపాల్ లాంటివారు ‘ఇప్పటికైనా మించిపోయింది లేదు. అధిష్టానం మనసు మార్చొచ్చు’ అని వ్యాఖ్యానిస్తున్న నేపధ్యంలో నిపుణుల అభిప్రాయాలను పరిశీలించడం ఉపయుక్తం కాగలదు. లోక్ సభకు సెక్రటరీ జనరల్ గా పని…