లండన్ లో బ్యాంక్సీ స్ట్రీట్ ఆర్ట్ ఎగ్జిబిషన్ (2008) -పునర్ముద్రణ
ప్రఖ్యాత లండన్ వీధి చిత్రకారుడు బ్యాంక్సీ , 2008 లో స్ట్రీట్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాడు. వాటర్ లూ స్టేషన్ అండర్ గ్రౌండ్ లో వినియోగంలో లేని టన్నెల్ లో ఈ ఎగ్జిబిషన్ ని నిర్వహించారు. బ్రిటన్, ఫ్రాన్సు, బెల్జియం లను కలిపే ‘యూరో స్టార్’ హై స్పీడ్ రైల్వే కంపెనీ ఈ టనెల్ ని వాడి వదిలేయగా, ఆ తర్వాత టాక్సీ డ్రైవర్లు ఉపయోగించారు. ఎగ్జిబిషన్ కి ‘కేన్స్ ఫెస్టివల్’ అని పేరు పెట్టారు.…