పోలీసుల సాయంతో తివారీకి రక్తపరీక్షలు చేయండి -ఢిల్లీ కోర్టు

పోలీసుల సహాయం తీసుకుని తివారీ కి రక్త పరీక్షలు నిర్వహించాలని ఢిల్లీ కోర్టు తమ రిజిస్ట్రార్ కి ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్ర ప్రదేశ్ మాజీ గవర్నర్, యు.పి, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా కూడా పని చేసిన ఎన్.డి.తివారీ తనకు తండ్రి అంటూ రోహిత్ శేఖర్ అనే 32 యేళ్ళ యువకుడు కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. డి.ఎన్.ఏ పరీక్షల ద్వారా రోహిత్ ఆరోపణలను నిర్ధారించడానికి కోర్టు ప్రయత్నిస్తున్నప్పటికీ రక్త నమూనా ఇవ్వడానికి నిరాకరిస్తూ వచ్చాడు.…

క్లుప్తంగా… 12.05.2012

మార్చిలో 3.5 % క్షీణించిన పారిశ్రామిక ఉత్పత్తి అమెరికా సైనికులకు ‘ఇస్లాం’ వ్యతిరేక పాఠాలు వియత్నాం యుద్ధ ఫోటోగ్రాఫర్ ‘హార్స్ట్ ఫాస్’ మరణం జాతీయం మార్చిలో 3.5 % క్షీణించిన పారిశ్రామిక ఉత్పత్తి భారత దేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచి (ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ -ఐ.ఐ.పి) మరో సారి నిరాశ కలిగించింది. మార్చి 2012 నెలలో పెరగకపోగా తగ్గిపోయింది. -3.5 శాతం వృద్ధి నమోదు చేసింది. అధిక ద్రవ్యోల్బణం, పెరుగుతున్న కరెంట్ ఖాతా లోటు, రూపాయి…

క్లుప్తంగా… 11.05.2012

మోడి నాలుగ్గోడల మధ్య చట్ట వ్యతిరేక ఆదేశాలిస్తే తప్పు కాదు –సిట్ 2010 లో అయిదేళ్లలోపు పిల్లల మరణాలు 16.8 లక్షలు జి8 సమావేశానికి పుటిన్ ఎగనామం, అమెరికాపై నిరసనతోటే స్వలింగ వివాహాలకి ఒబామా ఆమోదం జాతీయం మోడి నాలుగ్గోడల మధ్య చట్ట వ్యతిరేక ఆదేశాలిస్తే తప్పు కాదు –సిట్ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి నాలుగు గోడల మధ్య అధికారులకు చట్ట వ్యతిరేక ఆదేశాలిస్తే అది నేరం కాబోదని గుజరాత్ అల్లర్లపై నియమించబడిన ‘స్పెషల్ ఇన్వెస్టివేషన్…

వంద యేళ్ల క్రితం కలకత్తా -ఫొటోలు

బ్రిటిష్ ఇండియా కాలం నాటి కలకత్తాలో ప్రజా జీవనాన్ని తెలిపే ఫొటోలివి. అరుదయిన గ్లాస్ ప్లేట్ నెగిటివ్ లు లండన్ లోని ఒక మ్యూజియం ఆర్కైవ్స్ లో ఇవి లభ్యం అయ్యాయి. RCHAMS (Royal Commission on the Ancient and Historical Monuments of Scotland) వెబ్ సైట్ ఈ ఫొటోలను ప్రచురించింది. ఇవి 1912 నాటి ఫొటోలని తెలుస్తోంది. స్టేట్స్ మెన్ పత్రిక కాపీలతో చుట్టి ఉన్న 178 గ్లాస్ ప్లేట్ నెగిటివ్ ల  ప్యాకేజి…

తననూ వదలొద్దని కోరిన నెహ్రూ -కార్టూన్

ప్రజాస్వామిక వ్యవస్ధకు ‘ఫోర్త్ ఎస్టేట్’ గా పత్రికలను అభివర్ణించడం అందరూ ఎరిగిందే. కార్టూన్ ద్వారా రాజకీయ విమర్శలు చేయడం అత్యంత శక్తివంతమైన ప్రక్రియగా పత్రికలు అభివృద్ధి చేశాయి. కాసిన్ని గీతల ద్వారా ప్రకటించే రాజకీయ అభిప్రాయాలని నిషేధించాలని కోరడం అంటే ప్రజాస్వామ్య వ్యవస్ధలో అత్యంత ముఖ్యమైన ‘భావప్రకటనా స్వేచ్ఛ’ కు సంకెళ్లు వేయాలని కోరడమే. అందుకే ప్రజాస్వామ్య ప్రియులైన రాజకీయ నాయకులు తమను తాము విమర్శలకు అతీతులుగా ఎన్నడూ పరిగణించరు. భారత దేశ ప్రధమ ప్రధాని ‘జవహర్…

క్లుప్తంగా… 10.05.2012

జీన్స్, టీ షర్ట్ అసభ్య దుస్తులు, వేసుకోవద్దు -పంజాబ్ ప్రభుత్వం పాకిస్ధాన్ మైనారిటీలను కాపాడండి -విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ అణచివేతపై ‘గాంధీ మార్గం’లో తిరుగుబాటు చేస్తున్న పాలస్టీనియన్లు   జాతీయం జీన్స్, టీ షర్ట్ అసభ్య దుస్తులు, వేసుకోవద్దు -పంజాబ్ ప్రభుత్వం జీన్స్, టీ షర్ట్ లు అసభ్య దుస్తులనీ వాటిని వేసుకొని ఆఫీసుకి రావద్దని హర్యానా ‘స్త్రీ, శిశు సంక్షేమ శాఖ’ వివాదాస్పద ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాల్ని వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నా అందుకు…

గొడవకి కారణమైన ‘అంబేద్కర్ కార్టూన్’ ఇదే -కార్టూన్

శుక్రవారం లోక్ సభలో జరిగిన గొడవతో ఎన్.సి.ఇ.ఆర్.టి సెలక్షన్ కౌన్సిల్ సభ్యులూ, ఛీఫ్ సలదారులూ అయిన ఇద్దరు రాజీనామా చేయవలసి వచ్చింది. దళిత ఎం.పిలు గొడవ చేయడంతో ప్రముఖ కార్టూనిస్టు శంకర్ కార్టూన్ ఉన్న పదకొండవ తరగతి రాజకీయ శాస్త్రం లో ఒక పాఠ్యాంశంగా ఉన్న పుస్తకాన్ని తొలగిస్తున్నట్లు మానవ వనరుల శాఖ మంత్రి ‘కపిల్ సీబాల్’ ప్రకటించాడు. ఆయనతో పాటు ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కూడా కార్టూన్ అలా గీయవలసింది కాదని వ్యాఖ్యానించారు. కార్టూన్…

క్లుప్తంగా… 09.05.2012

జాతీయం పరువు హత్యలకు యు.పి డి.ఐ.జి మద్దతు తన కూతురు ఇంటి నుండి పారిపోయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుందనీ, అబ్బాయిపై చర్య తీసుకోవాలనీ ఫిర్యాదు చేసిన వ్యక్తికి కూతురిని చంపెయ్యమని అత్యున్నత పోలీసు అధికారి సలహా ఇవ్వడం సంచలనం రేపింది. తండ్రి స్ధానంలో తానున్నట్లయితే కూతురిని చంపేయ్యడమో లేదా తానే ఆత్మహత్య చేసుకోవడమో చేసేవాడినని సలహా ఇస్తుండగా సంభాషణను కేమెరాలు బంధించడంతో డి.ఐ.జి ఎస్.కె.మాధుర్ వ్యవహారం లోకానికి వెల్లడయింది. రెగ్యులర్ చెకింగ్ కోసం ఓ పోలీసు…

జాతీయ స్ధాయి విలుకత్తెకి కానిస్టేబుల్ కొలువు కూడా ఇవ్వలేరా?

ఈ ఫోటోలో అమ్మాయి పేరు నిషా రాణి దత్తా. విలువిద్యలో జాతీయ స్ధాయి ప్రతిభ కనబరిచిన 21 యేళ్ళ యువతి. కటిక పేదరికంలో పుట్టినా స్వయం కృషితో విలువిద్య క్రీడలో జాతీయ స్ధాయికి చేరింది. అయినప్పటికీ ఈ జార్ఘండ్ ఆడకూతురికి కనీసం కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయాయి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు. ఈ దేశ మూలవాసులయిన గిరిజన తెగల్లో పుట్టిన పాపానికి వృద్ధ తల్లిదండ్రులని, ఇద్దరు చెల్లెళ్లను పోషించుకోవడానికి తాను భద్రంగా కాపాడుకుంటూ వస్తున్న వెండి విల్లుని…

క్లుప్తంగా… 07.05.2012

జాతీయం మోడిని ప్రాసిక్యూట్ చెయ్యొచ్చు -అమికస్ క్యూరీ 2002 గుజరాత్ మారణకాండ కేసులో ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ని ప్రాసిక్యూట్ చేయదగ్గ సాక్ష్యాలున్నాయని సుప్రీం కోర్టు నియమించిన ‘అమికస్ క్యూరీ’ (కోర్టు సహాయకుడు) రాజు రామచంద్రన్ కోర్టుకి తెలియజేశాడు. ఇరు మతాల ప్రజల మధ్య ‘శతృత్వాన్ని ప్రోత్సహించినందుకు’ గాను మోడిని ప్రాసిక్యూట్ చేయవచ్చని ఆయన తన నివేదికలో పేర్కొన్నాడు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గుజరాత్ అల్లర్లపై విచారణ చేయడానికి ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ ఏర్పాటయింది. దశాబ్దం…

‘హజ్’ సబ్సిడీ రద్దు చేసిన సుప్రీం కోర్టు

‘హజ్’ యాత్రకు వెళ్ళే ముస్లిం ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ చెల్లించడాన్ని మంగళవారం సుప్రీం కోర్టు తప్పు పట్టింది. మరో పదేళ్ళలో ‘హజ్’ సబ్సిడీలను క్రమంగా రద్దు చేయాలని తీర్పు నిచ్చింది. మతపరమైన యాత్రలకు సబ్సిడీలు ఇవ్వడం ‘చెడ్డ మతాచారం’ గా అభివర్ణించింది. యాత్రీకులకు తోడు వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం స్వయంగా అధికారిక డెలిగేషన్స్ పంపిస్తూ పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడం ద్వారా ‘హజ్’ యాత్ర ను రాజకీయం చేస్తున్నారని అభిప్రాయపడింది. “ఈ విధానాన్ని అంతం చేయాలని…

క్లుప్తంగా… 04.05.2012

జాతీయం మణిపూర్ విద్యార్ధి డ్రగ్స్ వల్ల చనిపోలేదు –ఫోరెన్సిక్ నివేదిక బెంగుళూరు లో చదువుతున్న మణిపూర్ విద్యార్ధి రిచర్డ్ లోయితం డ్రగ్స్ వల్ల చనిపోలేదని ఫోరెన్సిక్ ఫలితాలు నిర్ధారించినట్లు ‘ది హిందూ’ తెలిపింది. ఆర్కిటెక్చర్ విద్యార్ధి అతని సీనియర్ విద్యార్ధులు కొట్టడం వల్ల చనిపోయాడని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సీనియర్ విద్యార్ధుల దాడిలో చనిపోయినప్పటికీ బెంగుళూరు పోలీసులు కేసు నమోదు చేయలేదని మణిపూర్ విద్యార్ధులపైన వివక్ష పాటిస్తున్నారని ఆరోపిస్తూ దేశ వ్యాపితంగా మణిపూర్ విద్యార్ధులు నిరసన ప్రదర్శనలు…

‘నీరు, అడవి, భూమి’ ల యజమానులు ఎవరన్నదే మావోయిస్టు సమస్య -బి.డి.శర్మ

గిరిజన ప్రాంతాల్లో “జల్, జంగిల్, జమీన్” యజమానులు ఎవరన్నదే మావోయిస్టులు, ప్రభుత్వం మధ్య ఉన్న ప్రధాన సమస్య అని మాజీ జిల్లా మేజిస్ట్రేట్ బి.డి.శర్మ అన్నారు. ఛత్తీస్ ఘర్ లో కిడ్నాపయిన కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ విడుదల కోసం మధ్యవర్తిత్వం వహించి బి.డి.శర్మ సఫలం అయ్యారు. న్యూఢిల్లీలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ బి.డి.శర్మ ఖనిజ సంపదలున్న భూములకు యజమానులైన గిరిజనులపైన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వారి ప్రయోజనాలకు వ్యతిరేకమైన అభివృద్ధి నమూనాను బలవంతంగా రుద్దుతున్నాయని, సమస్యకు…

అనగనగా దుబాయ్ లో… ఫొటోలు

దుబాయ్ ఇప్పుడొక కాస్మోపాలిటన్ ఒయాసిస్సు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవంతి ‘బర్జ్ ఖలీఫా’ దుబాయ్ లోనే ఉంది. అత్యంత విలాసవంతమయిన టూరిస్టు కేంద్రంగా దుబాయ్ భాసిల్లుతోంది. సొమ్ములు అనంతంగా పోగుపడిన వారు వాటిని త్వర త్వరగా ఖర్చు చేసుకోవడానికి దుబాయ్ సందర్శిస్తే సరిపోతుంది. అక్రమ సంపాదనను పెట్టుబడులు పెట్టుడానికీ, అక్రమ డబ్బుని దాచుకోవడానికి దుబాయ్ వీలు కల్పిస్తుంది. ఇది ఇప్పటి సంగతి. ఇరవై, ముప్ఫై యేళ్ల క్రితం దుబాయ్ పరిస్ధితి ఇది కాదు. పెట్రో డాలర్లు ముంచెత్తి…

అవును, నేను వేశ్య కూతుర్నే -నసీమా (వీడియో)

తల్లిదండ్రుల నిరాదరణకి గురై ఓ వేశ్య చేతికి చిక్కిన నసీమా కధ ఇది. వేశ్యా జీవితం బారిన పడకుండా తనను కాపాడిన అమ్మమ్మ కాని అమ్మమ్మ లాంటి వారి జీవితాలలో కొత్త మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న నసీమా అద్భుత మహిళ అనడంలో సందేహం లేదు. విదేశీ నిధుల కోసం ‘ప్రగతి శీల ఫోజులు’ కొట్టే ఎన్.జి.ఒ సంస్ధలపై నమ్మకం లేక తానే ‘పార్స్చం’ అనే సంస్ధను స్ధాపించి ఆశావహ దృక్పధంతో ముందుకు సాగుతోంది నసీమా. తల్లిదండ్రులు విడాకులు…