కువైట్ పై దాడికి 8 రోజుల ముందు, అమెరికా ఇరాక్ ల మధ్య ఏం జరిగింది?

ఆగస్టు 2, 1990 న కువైట్ పై ఇరాక్ దాడి చేసింది. ఇది దురాక్రమణ అని అమెరికా గగ్గోలు పెట్టింది. అకస్మాత్తుగా జరిగిన ఈ దాడి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిందని బి.బి.సి లాంటి వార్తా సంస్ధలు ప్రకటించాయి. స్వేచ్ఛా ప్రపంచంలో ఇలాంటి దాడులు కూడదని, ఇరాక్ బలగాలు బేషరతుగా కువైట్ నుండి విరమించుకోవాలని అమెరికా అధ్యషుడు జార్జి బుష్ (సీనియర్) అమెరికా పార్లమెంటు లోపలా బయటా ఎదతెరిపి లేకుండా నీతులు, బోధలు కురిపించాడు. ఒక స్వతంత్ర దేశంపై…

ఇరాక్‌పై దాడికోసమే అబద్ధాలతో రిపోర్టు తయారు చేశాం -ఇంగ్లండ్ ఇంటలిజెన్స్ మాజీ అధికారి

ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ “సామూహిక విధ్వంసక మారణాయుధాలు” కలిగి ఉన్నాడనీ, వాటివలన ఇంగ్లండు భద్రతకు ముప్పు అనీ నిర్ధారిస్తూ తయారు చేసిన నివేదిక (డొసియర్) వాస్తవాలపై ఆధారపడిన నివేదిక కాదనీ, తమకు వచ్చిన ఆదేశాల మేరకు ఇరాక్‌పై దాడిని అనివార్యం చేస్తూ లేని సాక్ష్యాలతో తయారు చేశామనీ నివేదిక రచయితల్లో ఒకరైన బ్రిటన్ ఇంటలిజెన్స్ మాజీ సీనియర్ అధికారి ఇంగ్లండ్ ప్రభుత్వం నియమించిన చిల్కాట్ కమిషన్ ముందు సాక్ష్యం ఇస్తూ చెప్పాడు. సెప్టెంబరు 2002…