సచిన్ పొగడ్తలు కట్టిపెట్టండి -పాక్ తాలిబాన్

సచిన్ టెండూల్కర్ రిటైర్మెంటే పెద్ద వార్త అనుకుంటే, రిటైర్మెంట్ అనంతర కాలంలో కూడా సరికొత్త వార్తలకు ఆయన రిటైర్మెంట్ కేంద్రం అవుతోంది. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఆయన్ను పొగడ్తల్లో ముంచడానికి, తద్వారా కాసింత క్రెడిబిలిటీ పొందడానికీ భారత రాజకీయ నేతలు పోటీ పడ్డ సంగతి తెలిసిందే. కానీ పాకిస్ధాన్ రాజకీయ రంగంలో ఇందుకు విరుద్ధమైన పరిణామం చోటు చేసుకుంది. పాకిస్ధాన్ తాలిబాన్ గా పేరొందిన తెహరీక్-ఎ-తాలిబాన్ సంస్ధ ‘సచిన్ పై పొగడ్తలు కురిపించడం ఇక కట్టిపెట్టాలని పాక్…

పోల్: భారత రత్నకు సచిన్ అర్హుడేనా?

సచిన్ టెండూల్కర్ ఒక క్రీడాకారుడు. క్రికెట్ అంటే ఆయనకు ప్రాణం. 40 యేళ్ళ జీవితంలో 30 యేళ్ళ నుండి క్రికెట్ ఆడుతున్న వ్యక్తి. పిన్న వయసులోనే జాతీయ జట్టులో స్ధానం సంపాదించి అద్భుతమైన టెక్నిక్ తో చేయి తిరిగిన బౌలర్లకు కూడా కొరకరాని కొయ్యగా మారిన బ్యాట్స్ మేన్. క్రికెట్ జీనియస్ గా భావించే డాన్ బ్రాడ్ మన్ చేత కూడా ప్రశంసలు అందుకున్న వ్యక్తి. అన్నింటికన్నా మిన్నగా అనేక క్రికెట్ రికార్డులు ఆయన సొంతం. అత్యధిక…

రాజకీయ నాయకులు ఇడియట్స్ -కత్తిరింపు

భారత రత్న అవార్డు పొందిన రసాయన శాస్త్రవేత్త ‘చింతామణి నాగేశ రామచంద్ర రావు (సి.ఎన్.ఆర్.రావు) తనకు అవార్డు ఇచ్చారన్న మొహమాటం కూడా లేకుండా రాజకీయనాయకుల గుణగణాలను ఒక్క మాటతో కడిగిపారేశారు. దేశంలో సైన్స్ అభివృద్ధికి ప్రభుత్వాలు ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదన్న చేదు నిజాన్ని సి.ఎన్.ఆర్ రావు విప్పి చెప్పారు. అసలు విద్యారంగం అంటేనే రాజకీయ నాయకులకు శ్రద్ధ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనాన్ని కూడా సి.ఎన్.ఆర్ రావు వదల్లేదు. కాస్త డబ్బులు ఎక్కువ…

అందరికీ సచిన్ జ్వరం, భారత రత్నకు కూడా

సచిన్ క్రికెట్ క్రీడా జీవితం నేటితో ముగిసింది. 40 యేళ్ళ సచిన్ టెండూల్కర్ నెలరోజులు ముందుగానే తన రిటైర్మెంట్ ప్రకటించడంతో అప్పటినుండీ దేశంలో క్రికెట్ జ్వరం అవధులు దాటి పెరిగిపోయింది. సచిన్ రిటైర్కెంట్ కోసమే అన్నట్లుగా వెస్టిండీస్ తో రెండు టెస్టుల సిరీస్ ను బి.సి.సి.ఐ ఏర్పాటు చేయడంతో అనేకమంది కలలు గనే ఒక అందమైన క్రీడా జీవితానికి అందమైన ముగింపు పలికినట్లయింది. రెండు మ్యాచ్ లు ఇన్నింగ్స్ తేడాతో గెలవడం ద్వారా జట్టు సహచరులు సచిన్…

ఈ ‘క్రికెట్ పిచ్చోడి’కి రిటైర్మెంట్ లేదు

ఇతని పేరు చాలామందికి తెలియదు గానీ, ఇతన్ని చూసినవారు మాత్రం బహుశా కోట్లమందే ఉండవచ్చు. బీహార్ నివాసి అయిన ఇతని పేరు సుధీర్ కుమార్ గౌతం. ఇతని జీవితం అంతా క్రికెటర్లు, క్రికెట్ స్టేడియంల చుట్టూ గడిచిపోతోంది. భారత క్రికెట్ దేవుడిగా కొలుపులు అందుకుంటున్న సచిన్ టెండూల్కర్ మరి కొద్ది రోజుల్లో రిటైర్ అవబోతున్నా, తన క్రికెట్ పిచ్చికి మాత్రం రిటైర్మెంట్ లేదని గౌతం స్పష్టం చేస్తున్నాడు. వంటినిండా జాతీయ పతాకాన్ని, సచిన్ పేరును పెయింటింగ్ వేసుకుని…

Sachin, MP

పార్లమెంటుతో సచిన్ సరికొత్త ఇన్నింగ్స్ -కార్టూన్

రాష్ట్ర పతి కోటాలో సచిన్ టెండూల్కర్ రాజ్య సభ సభ్యుడయ్యాడు. సెంచరీల శతకం సాధించినందుకు అభినందనలు అందుకోమని పిలిచి కాంగ్రెస్ సుప్రీం సోనియా ఆయనకి రాజ్య సభ్య సభ్యత్వం కట్టబెట్టింది. సచిన్ కి ‘భారత రత్న’ ఇవ్వాలని ఓ పక్క చర్చలు సాగుతుండగా రాజ్య సభ సభ్యత్వం కట్టబెట్టడం అనుమానాలు రేకెత్తించింది. భారత రత్న ఇవ్వలేక రాజ్య సభ్య సభ్యత్వం ఇచ్చినట్టా లేక భారత రత్న కు రాజ్య సభ సభ్యత్వం బోనస్సా అన్నది ముందు ముందు…

క్లుప్తంగా… 26.04.2012

అంతర్జాతీయం హెచ్.ఎస్.బి.సి బ్యాంకు యు.కె శాఖల్లో 2,200 ఉద్యోగాలు రద్దు ఇంగ్లాండులో హెచ్.ఎస్.బి.సి బ్యాంకు మరో 2,200 ఉద్యోగాలు రద్దు చేసింది. వాస్తవంగా రద్దు చేసినవి 3,100 ఉద్యోగాలు కాగా, కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలు పోను నికరంగా 2,217 ఉద్యోగాలు రద్దు చేసినట్లయింది. ఖర్చు తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఉద్యోగాలు రద్దు చేస్తున్నట్లు బ్యాంకు ప్రకటించింది. హెచ్.ఎస్.బి.సి గత సంవత్సరం 7,000 ఉద్యోగాలు రద్దు చేసింది. 2013 లోపు ప్రపంచ వ్యాపితంగా 30,000 ఉద్యోగాలు రద్దు చేస్తానని…

రాజ్య సభకు ‘సచిన్ టెండూల్కర్’?

కేంద్ర ప్రభుత్వంలో అధికారం నెరుపుతున్న కాంగ్రెస్ పార్టీ ‘సచిన్ టెండూల్కర్’ ను రాజ్య సభ సభ్యత్వానికి ప్రతిపాదించిందని ‘ఐ.బి.ఎన్ లైవ్’ పత్రిక తెలిపింది. సచిన్ ఇంకా ఏ సంగతీ చెప్పలేదని తెలుస్తోంది. సచిన్ నుండి స్పందన కోసం కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాజ్య సభ సభ్యత్వం స్వీకరించడానికి సచిన్ అంగీకరించకపోవచ్చని కూడా పత్రికలు రాస్తున్నాయి. సంచిన్ వైపు నుండి అధికారికంగా ఏ సమాచారమూ లేదు. సచిన్ టెండూల్కర్ ని రాష్ట్ర ప్రతి కోటాలో…

వంద సెంచరీల సచిన్ -ఫొటోలు

మార్చి 16 2012 తేదీన ఆసియా కప్ టోర్నమెంట్ లో బంగ్లాదేశ్ పై సచిన్ టెండూల్కర్ తన వందవ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీ కోసం భారత క్రికెట్ ప్రేమికులు సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్నారు. సచిన్ వందవ సెంచరీ సందర్భంగా ‘ది హిందూ’ పత్రిక అందించిన ఫొటోలు ఇవి. – –

2000వ టెస్ట్ మ్యాచ్, 100వ మ్యాచ్, 100వ సెంచరీ

ఇండియా క్రికెట్ జట్టు త్వరలో జరపనున్న ఇంగ్లండ్ టూర్‌లో భాగంగా జులై 21 నుండి 25 వరకూ ఇండియా, ఇంగ్లండ్ ల క్రికెట్ జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ టెస్ట్ మ్యాచ్ కి అనేక విధాలుగా ప్రాముఖ్యత ఉంది. ఇది మొత్తం ప్రపంచ క్రికెట్ టెస్టు క్రికెట్ జట్టుల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ లలోనే 2000 వ టెస్ట్ మ్యాచ్. అంతే కాకుండా ఇండియా, ఇంగ్లండు దేశాల మధ్య జరగనున్న 100…

ఇద్దరు లెజెండ్ ఆటగాళ్ళు కలుసుకున్న వేళ -ఫోటోలు

సచిన్ టెండూల్కర్, రోజర్ ఫెదరర్, ఇద్దరూ వారి ఆటల్లో ఉన్నత స్ధానాలకు చేరుకున్నావారు. అయినా ఆటల దాహం తీరక ఇంకా ఇంకా సాధించాలని తపిస్తున్నవారు. తపించడమే కాక శ్రమిస్తున్నవారు. వీరిద్దరూ కలుసుకుంటే, ఆ క్షణాలు వారిద్దరికే కాదు వారిని ఆరాధించే అభిమానులకు కూడా కన్నుల పండుగే. వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతున్న సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టెన్నిస్ రారాజు రోజర్ ఫెదరర్ కలుసుకున్న అపురూప క్షణాలివి.

నేను చూసిన ఆటగాళ్ళలో సచినే గొప్ప బ్యాట్స్ మెన్ -వివ్ రిచర్డ్స్

వెస్ట్ ఇండీస్ కి చెందిన లెజెండరీ బ్యాట్స్ మెన్ వివ్ రిచర్డ్స్ సచిన్ అభిమానుల జాబితాలో చేరాడు. “నేను డాన్^ని చూడలేదు. కానీ నా దృష్టిలో నా క్రికెట్ కెరీర్ లో నేను చూసిన బ్యాట్స్ మేన్ లలో సచినే గొప్ప బ్యాట్స్ మెన్. అతనికంటే గొప్ప బ్యాట్స్ మేన్ ను నేను చూడలేదు” అని తెలిపాడు. “సచిన్ కంటే గొప్ప బ్యాంట్స్ మేన్ ఎవరైనా ఉన్నట్లయితే అతనింకా రాలేదు” అని క్రికెట్ లెజండ్ వివ్ రిచర్డ్స్…