బోసిపోయిన రైలు పట్టాలు ‘తెలంగాణ’ను డిమాండ్ చేస్తున్నాయి -రైల్ రోకో ఫొటోలు

తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఇచ్చిన మూడు రోజుల రైల్ రోకో పిలుపు మేరకు మొదటిరోజు శనివారం నాడు రైల్ రోకో విజయవంతంగా జరిగింది. శుక్రవారం రోజే తెలంగాణ జిల్లాలన్నింటా మూడు వందల మంది వరకూ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు శనివారం మరో 2300 వరకూ అరెస్టు చేశామని ఐ.జి.అనూరాధ తెలిపింది. ముందస్తు అరెస్టులు ఇంకా కొనసాగుతాయని తెలిపింది. పట్టాలపై కూర్చున్నవారిపైన రైల్వే యాక్టు కింద అరెస్టు చేసి రిమాండ్…

తెలంగాణ అంశాన్ని కేంద్ర త్వరలోనే తేల్చేస్తుంది -సి.ఎం కిరణ్ కుమార్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సమస్యను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శనివారం ఢిల్లీలో విలేఖరులకు తెలిపాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో కేంద్ర తెలంగాణ సమస్యను పరిష్కరిస్తుందని ఆయన పేర్కొన్నాడు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపుతో ఢిల్లీ వచ్చిన సి.ఎం కిరణ కుమార్ రెడ్డి, డెప్యుటి సి.ఎం దామాదర రాజ నరసింహరాజు లు సీనియర్ మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, ఎ.కె.ఆంటోని, పి.చిదంబరం, గులాం నబీ ఆజాద్ లతో…

తెలంగాణ సకలజనుల సమ్మె, 17వ రోజు మంత్రుల ఇళ్ల నిర్బంధం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సకల జనుల సమ్మె అప్రహతిహతంగా కొనసాగుతోంది. భారత దేశ చరిత్రలోనే మున్నెన్నడూ లేనంతగా, ఒక్క నెల్లిమర్ల జూట్ కార్మిక ఉద్యమం తప్ప, సమాజంలోని దాదాపు అన్ని రంగాల ఉద్యోగులు, కార్మికులు తమ తమ విధులను బహిష్కరించి ఉద్యమించడమే కాక సమ్మెలు చేస్తున్నవారంతా రోడ్లపైకి వచ్చి నినదిస్తూ తెలంగాణ కావాలని డిమాండ్ చేస్తున్నారు. అనేక రకాల రూపాల్లో సమ్మెలో పాల్గొంటూ కనీ వినీ ఎరుగని సంయమనంతో శాంతియుతంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. శాంతియుత ఉద్యమమే…