ప్రశ్న: పదహారణాల తెలుగమ్మాయి అంటే?
నిఖిల్: ఈ ప్రశ్న అడగచ్చో లేదో తెలీదు, కానీ మీకు తెలుసనుకుంటున్నాను. తెలుగు సాంప్రదాయంలో ఉన్న ఆడపిల్లని పదహారణాల తెలుగమ్మాయి అని అంటాం కదా, అంటే ఏమిటి? మనం తెలుగు వాళ్ళం, తెలుగులో మాట్లాడటానికి నామోషి ఎందుకు? సమాధానం: తెలుగు సంస్కృతిని అచ్చంగా, కల్తీ లేకుండా, ఇతర సంస్కృతుల ప్రభావం లేకుండా ప్రతిబింబించే అమ్మాయిని ఊహించుకుని ఆమెకు పదహారణాల విలువ కట్టారు. మీరు చెబుతున్నదే ఆ విలువ. అణ విలువ భిన్నంలో (1/16) ఉంటుంది. కానీ పదహారు…