రైతుల ఆందోళన విరమణ, 11 తేదీన సంబరాలు!

హిందూత్వ అహంభావ పాలకులపై చావు దెబ్బ కొట్టిన ‘భారతీయ’ రైతులు ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. రైతు సంఘాల సంయుక్త పోరాట వేదిక ‘సంయుక్త కిసాన్ మోర్చా’ (ఎస్‌కే‌ఎం) నేతలు విధించిన షరతులకు కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా ఆమోదం చెప్పడంతో శనివారం, డిసెంబర్ 9 తేదీన ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరవధిక ఆందోళన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు బనాయించిన కేసులన్నింటినీ బేషరతుగా ఉపసంహరించుకుంటామని కేంద్రం రాత పూర్వకంగా హామీ ఇచ్చింది.…

చనిపోయిన రైతుల లెక్కల్లేవు, పరిహారం ఇవ్వలేం -కేంద్రం

మోడి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం చనిపోయిన రైతుల కుటుంబాల దీన పరిస్ధితితో తనకు సంబంధం లేదని చేతులు దులిపేసుకుంది. తమ నిర్లక్ష్యం, రైతుల పట్ల బాధ్యతారాహిత్యం కారణంగా ఏడాది పాటు చలికి వణుకుతూ, ఎండలో ఎండుతూ, వానలో నానుతూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలో పాల్గొనడం వలన అర్ధాంతరంగా చనిపోయిన రైతులకు సంబంధించిన రికార్డులు తమ వద్ద లేనందున వారి కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించే ప్రసక్తే తలెత్తదని స్పష్టం చేసింది. అసలు కనీస తర్కం కూడా…

ఎం‌ఎస్‌పి గ్యారంటీ కోసం ఆందోళన కొనసాగుతుంది -రైతు సంఘాలు

ఇతర ముఖ్యమైన డిమాండ్ల సాధన కోసం తమ ఆందోళన కొనసాగుతుందని రైతు సంఘాలు ప్రకటించాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఆపాలజీ వల్ల తమ డిమాండ్లు నెరవేరవనీ, క్షమాపణ కోరడానికి బదులు ‘కనీస మద్దతు ధర’ (Minimum Support Price) ను గ్యారంటీ చేసేందుకు చట్టం తేవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. “మేము ఎక్కడికీ వెళ్ళడం లేదు” అని సంయుక్త కిసాన్ మోర్చా నాయకుల్లో ఒకరు, బి‌కే‌యూ నాయకులూ అయిన రాకేశ్ తికాయత్ స్పష్టం చేశాడు. నరేంద్ర…