ఇ.యు, చైనాల వాణిజ్య యుద్ధం, మొదటి అంకం మొదలు
యూరోపియన్ యూనియన్ చెప్పినట్లుగానే చైనా సోలార్ విద్యుత్ ఉత్పత్తి పరికరాలపై దిగుమతి సుంకం పెంచడానికి నిర్ణయం తీసుకుంది. తద్వారా చైనాతో వాణిజ్య యుద్ధానికి తెర లేపింది. చౌక పరికరాలను పెద్ద ఎత్తున డంపింగ్ చేయడానికి వ్యతిరేకంగానే తాను అదనపు సుంకం విధిస్తున్నట్లు ఇ.యు ప్రకటించింది. సౌర విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే సోలార్ పానెళ్లు, బ్యాటరీలు, వేఫర్లు మొదలైన పరికరాలకు 12 శాతం అదనపు సుంకం వేయనున్నట్లు ఇ.యు ట్రేడ్ కమిషనర్ కారెల్ డి గచ్ మంగళవారం తెలిపాడు.…