ఎగ్జిట్ పోల్స్: ఎగిరెగిరి పడుతున్న స్టాక్ మార్కెట్లు

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎన్.డి.ఏ/బి.జె.పి/నరేంద్ర మోడి ప్రభుత్వం రాకను సూచించడంతో స్టాక్ మార్కెట్లు ఆనందంతో ఉరకలు వేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎన్.డి.ఏ కి అనుకూలంగా ఉండవచ్చన్న అంచనాతో సోమవారం భారీ లాభాలను నమోదు చేసిన జాతీయ స్టాక్ మార్కెట్లు తమ అంచనా నిజం కావడంతో మంగళవారం కూడా అదే ఊపు కొనసాగించాయి. దానితో స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. కాగా ఎన్.డి.ఏ ప్రభుత్వం ధనిక వర్గాలకు, కార్పొరేట్ కంపెనీలకు లాభకరం అని స్టాక్…

రెండేళ్ళ కనిష్ట స్ధాయికి భారత షేర్ మార్కెట్లు, వెంటాడుతున్న మాంద్యం భయాలు

బుధవారం భారత షేర్ మార్కెట్లు మరోసారి భారీగా నష్టపోయాయి. సోమవారం వరకూ వరుసగా ఎనిమిది రోజులు నష్టాలను ఎదుర్కొన్న షేర్లు మంగళవారం 0.75 శాతం లాభపడి ఇన్వేస్టర్లను ఆశలను కొద్దిగా చిగురింపజేసాయి. అయితే అది తాత్కాలికమేనన్న విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ బుధవారం భారత షేర్లు మళ్లీ ఘోరంగా పతనం అయ్యాయి. ఈ సారి రెండేళ్ల కనిష్ట స్ధాయిని తాకి ఇన్వెస్టర్లకు చెమటలు పుట్టించాయి. బుధవారం సెన్సెక్స్, నిఫ్టీలు రెండూ 2.3 శాతం పతనం అయ్యాయి. అధిక…

వరుసగా నాల్గవరోజు నష్టపోయిన భారత షేర్ మార్కెట్లు

భారత షేర్ మార్కెట్లు వరుసగా నాల్గవ రోజు కూడా నష్టపోయాయి. బి.ఎస్.ఇ సెన్సెక్స్ 12.32 పాయింట్లు (0.07 శాతం) నష్టపోయి 18197.20 వద్ద క్లోజ్ కాగా, నిఫ్టీ 5.75 పాయింట్లు (0.1 శాతం) నష్టపోయి 5482 వద్ద ముగిసింది. ఫండ్లు, మదుపుదారులు రియాల్టీ, మెటల్, ఆయిల్ & గ్యాస్, విద్యుత్ రంగాల షేర్లను అమ్మడంతో షేర్ మార్కెట్లు నష్టాలకు గురయ్యాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ నుండి అందుతున్న బలహీన సంకేతాలు, భారత దేశంలో ద్రవ్యోల్బణ కట్టడికి మరిన్ని…