సిరియాపై క్షిపణి దాడి వార్తలు; రూపాయి, షేర్లు పతనం

సిరియాపై అమెరికా క్షిపణి దాడి చేసిందన్న వార్తలు గుప్పుమన్నాయి. అమెరికా, సిరియాపై రెండు క్షిపణులతో దాడి చేసిందనీ, ఈ దాడి ఫలితంగా సిరియా రాజధాని డమాస్కస్ లో 50 మంది వరకూ చనిపోయారనీ వార్తలు షికారు చేస్తున్నాయి. తెలుగు టి.వి ఛానెళ్లు ఈ వార్తను ఎక్కడినుండి సంపాదించాయో గానీ ఈ రోజు మధ్యాహ్నం నుండి స్క్రోలింగ్ లో చూపాయి. అయితే ఇందులో నిజం లేదని

భారత స్టాక్ మార్కెట్లలో రక్తపాతం

శుక్రవారం భారత స్టాక్ మార్కెట్లు 2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభాన్ని తలపించాయి. అమెరికాలో ఆశావాహ పరిస్ధితులు నెలకొన్నాయని భావించిన అంతర్జాతీయ మదుపరులు భారత స్టాక్ మార్కెట్ల నుండి, రూపాయి నుండి తమ సొమ్ము ఉపసంహరించుకుని డాలర్ల కోసం ఉరుకులు పరుగులు పెట్టడంతో రూపాయి ఢమాల్ మని కూలిపోయింది. రూపాయితో పాటు స్టాక్ సూచీలు కూడా ఒక్కుమ్మడిగా కూలిపోయాయి. మార్కెట్ల పతనాన్ని పత్రికలు రక్తపాతంతో పోల్చుతున్నాయి. ఈ ఒక్కరోజే 2 లక్షల కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్ ను…

2011లో 25 శాతం పతనమైన భారత షేర్లు, సంస్కరణల కోసం భారత పాలకులపై ఒత్తిడి

భారత షేర్ మార్కెట్లకు 2011 సంవత్సరం నిరాశనే మిగిల్చింది. ప్రపంచంలో మరే దేశమూ నష్టపోనంతగా బి.ఎస్.ఇ సెన్సెక్స్ షేర్ సూచి ఈ సంవత్సరం 24.6 శాతం నష్టపోయింది. ఈ సంవత్సరం చివరి వ్యాపార దినం అయిన శుక్రవారం రోజు కూడా బి.ఎస్.ఇ సెన్సెక్స్ 0.6 శాతం నష్టపోయింది. సంవత్సరం పొడవునా ద్రవ్యోల్బణం రెండంకెలకు దగ్గరగా కొనసాగడం, ద్రవ్యోల్బణం అరికట్టడానికని చెబుతూ ఆర్.బి.ఐ అధిక వడ్డీ రేట్లు కొనసాగించడం, ఆర్ధిక వృద్ధి అనూహ్యంగా నెమ్మదించడం కారణాల వల్ల భారత…

రెండేళ్ళ కనిష్ట స్ధాయికి సెన్సెక్స్ పతనం

బోంబే స్టాక్ ఎక్చేంజి సెన్సెక్స్ సూచి శుక్రవారం రెండున్నర శాతం పతనం అయింది. మొత్తంగా రెండేళ్లలోనే అత్యంత కనిష్ట స్ధాయికి చేరుకుంది. బ్యాంకింగ్, మెటల్స్, సాఫ్ట్ వేర్ కంపెనీల షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో సెన్సెక్స్ భారీ నష్టాలను చవి చూసిందని విశ్లేషకులు, ట్రేడర్లు విశ్లేషించారని రాయిటర్స్ తెలిపింది. బ్యాంకుల షేర్లు, ఫ్యూచర్లు బాగా పతనం అయ్యాయనీ, ఆర్.బి.ఐ పరపతి విధానం సమీక్షతో నిరుత్సాహపడిన మదుపుదారులు అమ్మకాలకు పాల్పడ్డారని వారు చెబుతున్నారు. శుక్రవారం రిజర్వ్…

రెండేళ్ళ కనిష్ట స్ధాయికి భారత షేర్ మార్కెట్లు, వెంటాడుతున్న మాంద్యం భయాలు

బుధవారం భారత షేర్ మార్కెట్లు మరోసారి భారీగా నష్టపోయాయి. సోమవారం వరకూ వరుసగా ఎనిమిది రోజులు నష్టాలను ఎదుర్కొన్న షేర్లు మంగళవారం 0.75 శాతం లాభపడి ఇన్వేస్టర్లను ఆశలను కొద్దిగా చిగురింపజేసాయి. అయితే అది తాత్కాలికమేనన్న విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ బుధవారం భారత షేర్లు మళ్లీ ఘోరంగా పతనం అయ్యాయి. ఈ సారి రెండేళ్ల కనిష్ట స్ధాయిని తాకి ఇన్వెస్టర్లకు చెమటలు పుట్టించాయి. బుధవారం సెన్సెక్స్, నిఫ్టీలు రెండూ 2.3 శాతం పతనం అయ్యాయి. అధిక…

ఎస్.బి.ఐ డౌన్ గ్రేడ్ తో భారత షేర్ల పతనం

ఇండియా షెర్ మార్కెట్ సూచి బి.ఎస్.ఇ సెన్సెక్స్, గత ఐదు వారాల్లో మరోసారి 16,000 పాయింట్ల దిగువకు చేరుకుంది. మూడీస్ ఇన్‌వెస్టర్స్ సర్వీస్ సంస్ధ, దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేటింగ్ తగ్గించడంతో దాని ప్రభావం షేర్లపై పడింది. వరుసగా మూడవరోజు పతనమైన సెన్సెక్స్ మంగళవారం 286.59 పాయింట్లు (1.77 శాతం) నష్టపోయి 15745.43 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్.ఎస్.ఇ నిఫ్టీ 1.6 శాతం నష్టపోయి 4772.15 పాయింట్ల వద్ద ముగిసింది.…

మూడు సంవత్సరాల్లో అత్యధిక షేర్ నష్టాలను చవిచూసిన రెండో క్వార్టర్

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలోని రెండవ క్వార్టర్ (జులై, ఆగస్టు, సెప్టెంబరు 2011) గత మూడు సంవత్సరాలలోనే అత్యధికంగా నష్టాలను చవిచూసిన క్వార్టర్ గా రికార్డయ్యింది. 2008 లో సెప్టెంబర్ లో లేమేన్ బ్రదర్స్ కంపెనీ దివాలా తీసినట్లు ప్రకటించాక అక్టోబర్, నవంబరు డిసెంబరు నెలలతో కూడిన క్వార్టర్ అత్యధిక స్ధాయిలో సెన్సెక్స్ 25 శాతం నష్టపోయింది. దాని తర్వాత మళ్లీ ఇప్పుడు జులై, ఆగస్టు, సెప్టెంబరు (2011) లతో కూడిన క్వార్టర్ లో సెన్సెక్స్ 12.8 శాతం…

కుప్ప కూలిన షేర్లు, బ్లూఛిప్స్‌తో సహా ఒక్క రోజులోనే 2.15 లక్షల కోట్లు నష్టం

గురువారం షేర్ మార్కెట్లు మదుపుదారులకు చుక్కలు చూపించాయి. మూడు సంవత్సరాల క్రితం నాటి ప్రపంచ ఆర్ధిక సంక్షోభం రోజులను ఒకసారి గుర్తుకు తెచ్చాయి. గత 26 నెలల్లోనే ఎన్నడూ లేనంతగా సెన్సెక్స్ సూచి 704 పాయింట్లు నష్టపోయింది. మొత్తం షేర్ల విలువలో చూసినట్లయితే షేర్లలో ఉన్న మదుపుదారుల సొమ్ము రు.2.15 లక్షల కోట్లు ఒక్కరోజులో అదృశ్యమైంది. చిన్న కంపెనీల షేర్ల కంటే బ్లూచిప్ కంపెనీల షేర్లు ఉన్నవారే అత్యధికంగా నష్టపోవడం విశేషం. లిస్టెడ్ షేర్ల విలువ బుధవారం…

నిలువునా కూలిన భారత షేర్లు, ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ ప్రభావం

గురువారం భారత్ షేర్ మార్కెట్లు నిలువునా కుప్పకూలాయి. మూడు శాతానికి పైగా నష్టాలను మూటగట్టుకున్నాయి. గత రెండు మూడు రోజులుగా సంపాదించిన లాభాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఆసియా మార్కెట్లనుంది ప్రతికూల సంకేతాలు అందడం, అమెరికా ఆర్ధిక వృద్ధిపై ఫెడరల్ రిజర్వు ప్రతికూల దృశ్యాన్ని ఆవిష్కరించడం తదితర ప్రపంచ స్ధాయి సంకేతాలు భారత షేర్ మార్కెట్లను కూల్చివేశాయి. దాదాపు అన్ని లిస్టెడ్ షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి పెరిగింది. లోహాలు, రియల్ ఎస్టేట్ కంపెనీల షేర్లు ఐదు శాతం వరకూ పతనమయ్యాయి.…

ఆర్.బి.ఐ రేట్ల పెంపుతో పతనమైన షేర్ మార్కెట్

శుక్రవారం జరిపిన ద్రవ్య విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరొక సారి వడ్డీ రేట్లను పెంచింది. యధావిధిగా ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి వడ్డీ రేట్లు పెంచక తప్పడం లేదనీ, ద్రవ్యోల్బణం కట్టడి చేయడమే తమ ప్రధమ కర్తవ్యమనీ ఆర్.బి.ఐ గవర్నర్ మరొకసారి ప్రతిజ్ఞ చేశాడు. వడ్డీ రేట్ల పెంపుదల జిడిపి పెరుగుదల రేటుకు ప్రతికూలంగా పరిణమించడంతో ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్.బి.ఐ గవర్నర్ వడ్డీ రేట్లు పెంచడం కాకుండా ఇతర మార్గాలను అనుసరించాలని ప్రధాని ఆర్ధిక…

జి7, యూరోజోన్‌ల వైఫల్యంతో ప్రపంచ స్ధాయిలో షేర్ల పతనం

శుక్రవారం జరిగిన జి7 గ్రూపు దేశాల సమావేశం యూరోజోన్ సంక్షోభం పరిష్కారానికి ఏ విధంగానూ ప్రయత్నించకపోవడంతో దాని ప్రభావం స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. యూరోజోన్ దేశాల్లో, ముఖ్యంగా జర్మనీకీ ఇతర దేశాలకీ మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తడం కూడా షేర్ మార్కెట్లపై ప్రపంచ స్ధాయి ప్రభావం పడుతోంది. జపాన్ షేర్ మార్కెట్ నిక్కీ గత రెండున్నర సంవత్సరాలలోనే అత్యల్ప స్ధాయికి పడిపోయింది. భారత షేర్ మార్కెట్లలో సెన్సెక్స్ సూచి మళ్ళీ పదాహారు వేల పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా,…

ఘోరంగా పడిపోయిన పారిశ్రామిక వృద్ధి, షాక్‌లో మార్కెట్లు

అసలే అమెరికా, యూరప్ ల రుణ సంక్షోభాలతో, అమెరికా ఆర్ధిక వృద్ధి నత్త నడకతోనూ నష్టాలతో ప్రారంభమైన ఇండియా స్టాక్ మర్కెట్లకు పారిశ్రామిక వృద్ధి సూచిక గణాంకాలు షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చాయి. పారిశ్రామిక వృద్ధి సూచిక (ఐఐపి – ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్) మార్కెట్ అంచనాలను మించి క్షీణించడంతో సెన్సెక్స్, నిఫ్టీలు పెద్ద ఎత్తున నష్టాలను రికార్డు చేశాయి. మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి సెన్సెక్స్ రెండు శాతం పైగా 390 పాయింట్లు కోల్పోయి 16485…

ఈ వారంలో భారిగా నష్టపోయిన షేర్ మార్కెట్లు

ఈ శుక్రవారంతో ముగిసిన వారంలో భారత షేర్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అమెరికా, యూరప్ ల రుణ సంక్షోభాలు నష్టాలకు ప్రధాన కారణంగా నిలిచాయి. అమెరికా, యూరప్ ల ఆర్ధిక వృద్ధిపై అనుమానాలు తీవ్రం అయ్యాయి. సోమవారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ రోజు మార్కెట్లకు సెలవు. మంగళవారం ప్రారంభమయిన షేర్ మార్కెట్లలో బి.ఎస్.ఇ సెన్సెక్స్ 17055.99 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఈ రోజు శుక్రవారంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి 16141.67 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.…

రుణ సంక్షోభంలో ఫ్రాన్సు కూడా! పతనబాటలో అమెరికా, యూరప్ షేర్లు

అమెరికా క్రెడిట్ రేటింగ్ ప్రభావం నుండి తేరుకుని మంగళవారం అమెరికా, యూరప్ దేశాల స్టాక్ మార్కెట్లు లాభాలు చవి చూశాయి. కాని ఆ ఆనందం బుధవారానికి అవిరైపోయింది. యూరోజోన్‌లో రెండవ శక్తివంతమైన ఆర్ధిక వ్యవస్ధ కలిగి ఉన్న ఫ్రాన్సు కూడా యూరప్ అప్పు సంక్షొభం బారిన పడనుందని అనుమానాలు బలంగా వ్యాపించాయి. దానితో యూరప్, అమెరికా ల షేర్ మార్కెట్లు పెద్ద ఎత్తున అమ్మకాలకు గురైనాయి. రుణ సంక్షోభం దరిమిలా ఫ్రాన్సు క్రెడిట్ రేటింగ్ కూడా తగ్గిపోతుందన్న…

మార్కెట్ల విధ్వంసంపై ఇన్‌వెస్టర్ల హావ భావాలు -ఫోటోలు

గత శుక్రవారం అమెరికా క్రెడిట్ రేటింగ్‌ను ఎస్‌&పి క్రెడిట్ రేటింగ్ సంస్ధ అత్యున్నత రేటింగ్ AAA నుండి రెండో అత్యున్నత రేటింగ్ AA+ కి తగ్గించింది. దానితో అమెరికా ప్రభుత్వం, కంపెనీలు, వినియోగదారులకు అప్పుల ఖరీదు (వడ్డీ రేటు) పెరిగిపోయింది. దానివలన పెట్టుబడులు తగ్గి, అప్పటికే అనేక బలహీనతలతో తీసుకుంటున్న అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మరింత క్షీణిస్తుందనీ, అమెరికా మరొక సారి మాంద్యానికి (రిసెషన్) గురై అది ప్రపంచం అంతా వ్యాపిస్తుందనీ ఒక్క సారిగా భయాలు ఇన్‌వెస్టర్లను…