ఎఎపిలో లుకలుకలు, ఎ.కె అరెస్టుతో గట్టెక్కే ప్రయత్నం!

సాధారణ ఎన్నికలు ముగియడంతో ఓటమి చెందిన పార్టీలు కాసింత సంక్షోభానికి లోను కావడం మామూలే. అయితే అది సాధారణ, సాంప్రదాయ పార్టీలకు సంబంధించిన వ్యవహారం. అక్కడ స్వార్ధ ప్రయోజనాల కోసమే చేరికలు, దూకుళ్ళు ఉంటాయి. కానీ ఆం ఆద్మీ పార్టీ అలాంటి పార్టీ కాదు లేదా కనీసం ఆ పార్టీ నాయకులు అలా చెబుతారు. అద్భుతాలేమీ సృష్టించకపోయినా కనీసం గణనీయ మొత్తంలోనయినా లోక్ సభ సీట్లు సాధిస్తుందని అంచనా వేసిన ఎఎపి కేవలం 4 సీట్లు మాత్రమే…

స్టింగ్ ఆపరేషన్ లో దొరికిపోయిన ఎఎపి అభ్యర్ధి?

ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్ధి ఒకరు అక్రమ పద్ధతుల్లో విరాళాలు సేకరించడానికి అంగీకరించారన్న ఆరోపణలు ముప్పిరిగొన్నాయి. ఒక మీడియా పోర్టల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్ లో ఎఎపి అభ్యర్ధి షాజియా ఇల్మి అక్రమ విరాళాలు అంగీకరిస్తూ దొరికిపోయారని ఆరోపణలు రావడంతో బడా పార్టీలు ఎఎపిపై తమ దాడిని తీవ్రం చేశాయి. తమ అభ్యర్ధిపై స్టింగ్ ఆపరేషన్ కుట్రగా అరవింద్ కేజ్రివాల్ కొట్టిపారేస్తూ విచారణకు ఆదేశించారు. కాగా పోటీనుండి తప్పుకోవడానికి అభ్యర్ధి సిద్ధపడ్డారు. మీడియా సర్కార్ అనే పోర్టల్…