స్పాట్ ఫిక్సింగ్ వెనక దావూద్, ఛోటా షకీల్

పీట ముడి పడిందో, విడిపోయిందో గానీ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అతని అనుచరుడు ఛోటా షకీల్ ల పాత్ర ఉన్నదని కనుగొన్నామని పోలీసులు ప్రకటించేశారు. దానితో స్పాట్ ఫిక్సింగ్ నిందితులు అందరిపైనా MCOCA (Maharashtra Control of Organised Crimes Act) చట్టం కింద కేసులు పెడుతున్నామని వారు తెలిపారు. వారిలో శ్రీశాంత్ కూడా ఉన్నాడు. బుకీలు బెదిరించి ఆటగాళ్లను లొంగదీసుకున్నారని కూడా పోలీసులు చెబుతున్నారు. దావూద్ ముఠా ఆదేశాల…

ఐ.పి.ఎల్ మాయల బూరోడు -కార్టూన్

పైడ్ పైపర్ అనేది జర్మనీలో బహుళ ప్రచారంలో ఉన్న ఒక కధ. ఓ చిన్న నగరానికి ఎలుకలు పెద్ద బెడదగా ఉండేవిట. వాటిని వదిలించుకోడానికి నగర జనం, అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు. ఒకసారి బూర (పైపర్) ఊదుకుంటూ రంగు రంగుల దుస్తులు ధరించిన ఒక వ్యక్తి ఆ నగరానికి వచ్చాడు. ఎలుకలను తాను తరిమేస్తానని, అందుకు తనకు తగిన ఫలితం ఇవ్వాలని కోరాడాయన. ప్రజలు, మేయర్ చర్చించుకుని పెద్ద మొత్తం ఇవ్వడానికి సరేనన్నారు.…

పిల్ల ఫిక్సింగ్ ముఠా అణచివేతలో భాగంగా శ్రీశాంత్ బుక్కయ్యాడా?

ఈనాడు పత్రిక ప్రకారం క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ లు, స్పాట్ ఫిక్సింగ్ లు అన్నీ కలుపుకుని ఈసారి చేతులు మారిన మొత్తం అక్షరాలా రు. 47,000 కోట్లు. ఇది గత సంవత్సరం రు. 43,000 కోట్లట. అంటే 2జి, బొగ్గు కుంభకోణాలను తలదన్నే మొత్తాలు క్రికెట్ ఫిక్సింగ్ వ్యాపారంలో ఇమిడి ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తాల్లో శ్రీశాంత్, చండీలా, చవాన్ లకు అందింది కోటి రూపాయలకు మించలేదు. మరి మిగిలిన మొత్తం ఎవరి చేతులకు చేరినట్లు, ఎవరి…

క్రికెట్ ధన యజ్ఞంలో సమిధలు ఆటగాళ్లు

కేరళ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ లో దొరికిపోయాడు. అతనితో పాటు రాజస్ధాన్ రాయల్స్ కి చెందిన మరో ఇద్దరు ఆటగాళ్లను ఢిల్లీ పోలీసులు గురువారం తెల్లవారు ఝామున అరెస్టు చేయడంతో ఐ.పి.ఎల్ స్పాట్ ఫిక్సింగ్ విషయాలు బైటికి వచ్చాయి. ఏప్రిల్ నుండే తాము ఆటగాళ్ల పైనా, బుకీల పైనా నిఘా పెట్టామని వారిని తప్పులు చేయనిచ్చి అరెస్టు చేశామని పోలీసులు సగర్వంగా, సంచలనాత్మకంగా ప్రకటించారు. జాతీయ జట్టు కెప్టెన్ ధోనీయే కుట్ర చేసి తమ…