నీటి దౌత్యం: మాల్దీవులకు ఇండియా, శ్రీలంకకు చైనా

అమెరికా తలపెట్టిన ఆసియా-పివోట్ వ్యూహం పుణ్యమాని దక్షిణాసియాలో ఇండియా-చైనాల మధ్య పోటీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇండియా తన నౌకా, వాయు బలగాలను వినియోగించి మాల్దీవులకు భారీ మొత్తంలో మంచి నీటిని సరఫరా చేసిన మూడో రోజుకే శ్రీలంకలో భారీ నీటి ప్రాజెక్టును చైనా ఆవిష్కరించింది. 230 మిలియన్ డాలర్ల ఖర్చుతో శ్రీలంకలో అతి పెద్ద నీటి సరఫరా ప్రాజెక్టుకు చైనా కంపెనీ ఒకటి శ్రీకారం చుడుతోందని జిన్ హువా వార్తా సంస్ధ ద్వారా తెలుస్తోంది. చైనా…

శ్రీలంక మీదుగా తమిళనాట కమల వికాసం -కార్టూన్

సాధారణ ఎన్నికల్లో బి.జె.పి గెలుపుకి వాల్ స్ట్రీట్ కంపెనీలూ స్వయంగా రంగంలోకి దిగడం తెలిసిన విషయమే. సామ్రాజ్యవాద కంపెనీలు గనుక తమ అనుకూల ప్రభుత్వాలు వచ్చేలా చూసుకోవడం అవి ఎప్పుడూ చేసేపనే. కానీ సార్క్ సహోదరి శ్రీలంక ప్రభుత్వం సైతం తన పొరుగునే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో బి.జె.పి పునాదులు విస్తరించడానికి సకరిస్తుందని కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరు. భారతీయ జనతా పార్టీలో వ్యూహ చతురుడుగా ప్రసిద్ధికెక్కిన పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, తమిళనాడులో కమలం…

భారత ప్రధానికి బోలెడు ఉపగ్రహాలు -కార్టూన్

“శ్రీలంక నుండి అప్రమత్తత సంకేతమా? కాస్త ఆగండి. నేను చెన్నైలోని మా ప్రాంతీయ ఉపగ్రహం నుండి వివరాల కోసం ఎదురు చూస్తున్నాను.” ********* భారత ప్రధాని నరేంద్ర మోడీకి బోలెడు ఉపగ్రహాలు. ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాధినేతలను పిలిపించుకుని (సో కాల్డ్) ‘చరిత్ర సృష్టించడం’ ద్వారా భారత పెద్దన్న పాత్రను ఆదిలోనే రుజువు చేశారు ప్రధాని. ఆ చర్యతో భారతేతర సార్క్ దేశాలు ఇండియా ఉపగ్రహాలన్న అభిప్రాయం ఒకటి అంతర్జాతీయ పరిశీలకులకు ఏర్పడిపోయింది. ప్రధాని మోడి దేశీయంగా…

చోగం: కిం కర్తవ్యం? -కార్టూన్

కామన్వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సమావేశానికి హాజరయ్యే విషయంలో ప్రధాన మంత్రికి పెద్ద చిక్కే వచ్చినట్లుంది. నిజంగా చిక్కు వచ్చిందో, లేదో గానీ దేశంలో అలాంటి అభిప్రాయం కల్పించడంలో మాత్రం మీడియా సహకారంతో ప్రభుత్వం సఫలం అయింది. బ్రిటిష్ వలస సామ్రాజ్యానికి ప్రతీకగా నిలిచిన కామన్వెల్త్ కూటమిలో ఇప్పటికీ ఇండియా సభ్య దేశంగా కొనసాగడం ఒక విపరీతం అయితే అది శ్రీలంకలో జరుగుతోంది కనక హాజరు కావద్దని కొందరు, కావాల్సిందేనని మరి కొందరు జుట్లు పీక్కోవడం మరో విపరీతం!…