రాజపక్సే: నిలువునా కూలిన మర్రిమాను -కార్టూన్

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మైత్రీపాల సిరిసేన గెలుపును ‘ప్రజాస్వామ్యం విజయం’గా ది హిందు అభివర్ణించింది. అదే విషయాన్ని కార్టూనిస్టు ఇలా చెప్పారు. ప్రజాస్వామ్యం పని చేయడం ప్రారంభిస్తే మహేంద్ర రాజపక్సే లాంటి ఊడలు దిగిన మర్రిమానులు సైతం నిలువునా కూలిపోవలసిందేనని కార్టూనిస్టు భావన! వాస్తవంలో ప్రజాభిప్రాయాన్ని, ప్రజల భావోద్వేగాలను నియంత్రించగల భౌగోళిక స్ధాయి ఘటనలను ప్రేరేపించగల శక్తులు పని చేస్తున్నప్పుడు ఆధిపత్య శక్తుల అవసరాలే ప్రజాస్వామ్యం ముసుగు వేసుకుని పత్రికల నుండి, టి.వి ఛానెళ్ల నుండి ప్రజల…

శ్రీలంక ఎన్నికలు: దక్షిణాసియాలో పెరుగుతున్న అమెరికా పెత్తనం

దక్షిణాసియాలో వ్యూహాత్మకంగా కీలక ప్రాంతంలో ఉన్న మన పొరుగు దేశం శ్రీలంకలో అద్యక్ష ఎన్నికలు ముగిశాయి. రాజ్యాంగాన్ని సవరించి మరీ మూడోసారి అద్యక్షరికం చెలాయిద్దామని ఆశించిన మహేంద్ర రాజపక్సేకు శృంగభంగం అయింది. పదవీకాలం ఇంకా రెండు సంవత్సరాలు మిగిలి ఉన్నప్పటికీ ఎన్నికలు జరిపించిన రాజపక్సే అనూహ్య రీతిలో ఓటమి పాలయ్యాడు. ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు అధికార పార్టీ అయిన శ్రీలంక ఫ్రీడం పార్టీ (ఎస్.ఎల్.ఎఫ్.పి) లోనూ, ప్రభుత్వం లోనూ ప్రధాన బాధ్యతలు నిర్వహించిన మైత్రీపాల…