బ్యాట్స్ మేన్, రన్నర్ ఇద్దరూ ఆయనే -కార్టూన్

బి.సి.సి.ఐ భారత ప్రభుత్వ సంస్ధ అని చాలామంది భావిస్తారు. అది కేవలం ప్రైవేటు క్రికెట్ సంఘాలను కేంద్రీకృత స్ధాయిలో నియంత్రించే ప్రైవేటు సంస్ధ మాత్రమేనని వారికి తెలియదు. అనేక యేళ్లుగా భారత ప్రజల్లో క్రికెట్ జ్వరాన్ని పెంచి పోషించి ఆ జ్వరాన్ని సొమ్ము చేసుకుంటూ ప్రపంచంలోనే అత్యంత ధనికవంతమైన క్రికెట్ బోర్డుగా బి.సి.సి.ఐ అవతరించింది. బి.సి.సి.ఐని కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చుకునేందుకు కొన్ని సార్లు ప్రయత్నాలు జరిగాయి. కానీ క్రికెట్ జబ్బు డబ్బు తినడం మరిగిన సంపన్నులు…

ఐ.పి.ఎల్ కుంభకోణం: శ్రీనివాసన్, దిగిపో! -సుప్రీం

భారత క్రికెట్ సామ్రాజ్యాన్ని ఏలుతున్న శ్రీనివాసన్ కు ఊహించని వైపు నుండి కొరడా దెబ్బ ఛెళ్ మని తగిలింది. ఐ.పి.ఎల్ కుంభకోణం నేపధ్యంలో ఒకవైపు చెన్నై సూపర్ కింగ్స్ టీం యజమానిగా ఉంటూ మరోవైపు బి.సి.సి.ఐ అధిపతిగా ఎలా కొనసాగుతారని ప్రశ్నించింది. అల్లుడి మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ కార్యకలాపాలపై నిస్పాక్షిక విచారణ జరగాలంటే బి.సి.సి.ఐ అధ్యక్ష పదవికి శ్రీనివాసన్ రాజీనామా చేయవలసిందేనని తేల్చి చెప్పింది. ‘మీరే తప్పుకుంటారా లేక మమ్మల్ని తప్పించమంటారా?’ అని సూటిగా ప్రశ్నించింది. కమిటీ…

బి.సి.సి.ఐ మ్యాచ్ ఫిక్స్, ‘శ్రీ’నివాసన్ ఔట్?

ఆదివారం బి.సి.సి.ఐ బోర్డు అత్యవసర సమావేశం జరిపి అధ్యక్షుడు శ్రీనివాసన్ కు ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. కార్యదర్శి జగ్దాలే, ట్రెజరర్ అజయ్ షిర్కే ల రాజీనామాలతో శ్రీనివాసన్ పై ఒత్తిడి బాగా పెరిగినట్లు తెలుస్తోంది. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ లాంటి పరిణామాలను కారణంగా చూపుతూ, ఐ.పి.ఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా కూడా శనివారం రాజీనామా చేయడంతో ఇక శ్రీనివాసన్ రాజీనామా దాదాపు ఖాయమేనని పత్రికలు చెప్పేస్తున్నాయి. అయితే రాజీనామాకు శ్రీనివాసన్ కొన్ని షరతులు విధించినట్లు తెలుస్తోంది. తనకు…

చెన్నై టీం ఓనర్లే స్పాట్ ఫిక్సర్లు, పందెందార్లు

కలుగులో ఎలుక బైటికి వచ్చేస్తోంది. పోలీసులు పెట్టిన పొగ తట్టుకోలేక పుట్టలో పాములు వరుసగా తోసుకుని బైటికొస్తున్నాయి. విందూ దారా సింగ్ ఇచ్చిన వివరాలు నిజమేనని ముంబై పోలీసులకు స్పష్టంగా అర్ధం అయింది. స్పాట్ ఫిక్సింగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ యజమాని, బి.సి.సి.ఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు, ఇండియా సిమెంట్స్ కంపెనీ అధినేతల్లో ఒకరు అయిన గురునాధ్ మీయప్పన్ పాత్ర ఉన్నదని ముంబై పోలీసుల వద్ద సరిపోయినన్ని సాక్ష్యాలు ఉన్నాయట. ఈ మేరకు ముంబై జాయింట్…