సనాతన కుల-మత వ్యవస్ధ పునరుద్ధరణే కంగనా ప్రబోధిస్తున్న విముక్తి!

నటి కంగనా రనౌత్ తన వ్యాఖ్యలపై కొంత స్పష్టత ఇచ్చారు. తాను అన్నీ తెలిసే 1947 నాటి స్వతంత్రంపై వ్యాఖ్యానించానని తన వివరణ ద్వారా స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు తప్పయితే తన ‘పద్మ శ్రీ’ అవార్డు వెనక్కి ఇచ్చేందుకు సిద్ధం అని ప్రకటించారు. దానికి ముందు తన అనుమానాలు తీర్చాలని ఆమె కొన్ని ప్రశ్నలు సంధించారు. తన అనుమానాలకు సంతృప్తికరంగా సమాధానం ఇస్తే అవార్డు ఇచ్చేస్తానని చెప్పారు. అయితే కంగనా రనౌత్ ఇచ్చిన వివరణ మరిన్ని…

రాహుల్, మోడీ: పంచింగ్ బ్యాగ్స్ -కార్టూన్

ఎన్నికల ప్రచారం మామూలుగా ఎలా ఉండాలి? పోటీ చేసే అభ్యర్ధులు తమ తమ నియోజకవర్గాలను ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పాలి. నియోజక వర్గం సమస్యల పరిష్కారం దేశ భవిష్యత్తుతో ఎలా ముడి పడి ఉన్నాయో చెప్పగలగాలి. తమ తమ పార్టీల విధానాలను చెబుతూ అవి దేశాభివృద్ధికీ, నియోజకవర్గాల్లోని సమస్యల పరిష్కారానికీ ఎలా దోహదపడతాయో చెప్పాలి. కానీ జరుగుతున్నది అందుకు పూర్తిగా విరుద్ధం. ప్రత్యర్ధి పార్టీల నాయకులపైన ఎంత గొప్పగా విమర్శలు చేస్తే అంత గొప్ప ప్రచారంగా పార్టీల…