బి.జె.పి పుండుపై శివసేన ఉప్పు
అసలే పరువు పోయి బాధలో ఉన్నపుడు మిత్రుడు చేసే సరదా ఎగతాళి కూడా కోపం తెప్పిస్తుంది. మిత్రులు అనుకున్నవాళ్లు సీరియస్ గానే ఎగతాళి చేస్తే ఇక వచ్చే ఆగ్రహం పట్టలేము. బి.జె.పి పరిస్ధితి ప్రస్తుతం ఇలాగే ఉంది. ఏఏపి చేతుల్లో చావు దెబ్బ తిన్న దిగ్భ్రాంతి నుండి ఇకా బైటపడక ముందే మహారాష్ట్రలో మిత్ర పక్షంగా అధికారం పంచుకుంటున్న శివ సేన ఎగతాళి ప్రకటనలు చేస్తూ బి.జె.పి దుంప తెంచుతోంది. “వేవ్ కంటే సునామీ ఇంకా శక్తివంతమైనదని…