వ్యాపం: సమాచారాన్ని తొక్కిపెట్టిన సి.ఎం చౌహాన్
సుప్రీం కోర్టు రంగంలోకి దిగడంతో హడావుడిగా సి.బి.ఐ విచారణను కోరి ‘ఆ క్రెడిట్ నాదే’ అని చెప్పుకుంటున్న మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బండారం క్రమంగా బయిటకు వస్తోంది. ముఖ్యమంత్రిగా మధ్య ప్రదేశ్ శాసన సభకు నాయకత్వం వహించే చౌహాన్ తన శాఖలో జరిగిన కుంభకోణం గురించిన సమాచారాన్ని తొక్కిపెట్టి సభకు తప్పుడు సమాచారం ఇచ్చిన సంగతి వెలుగులోకి వచ్చింది. అసలు కుంభకోణాన్ని వెలికి తీసిందే తానని డంబాలు పలుకుతున్న చౌహాన్ సభను తప్పుదారి…