టి.ఎం.సి బలహీనతలే బి.జె.పికి బలమా? -కార్టూన్

పశ్చిమ బెంగాల్ లో ఒక దశలో ఎదురు లేనట్లు కనిపించిన తృణ మూల్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం వరుస ఇక్కట్లు ఎదుర్కొంటోంది. శారద చిట్ ఫండ్ కుంభకోణం మమత బెనర్జీ మెడకు భారీ గుదిబండగా మారిపోయింది. బర్ద్వాన్ పేలుళ్లు చేయించింది టి.ఎం.సి పార్టీయే అన్నట్లుగా బి.జె.పి అధ్యక్షుడు ప్రచారం చేస్తున్నారు. శారదా చిట్ ఫండ్ డబ్బు బర్ద్వాన్ పేలుళ్లకు ఉపయోగించారని,  శారదా చిట్ ఫండ్ కుంభకోణం దోషులను టి.ఎం.సి కాపాడుతోందని ఒక ర్యాలీలో మాట్లాడుతూ బి.జె.పి అమిత్…