భద్రత గ్యారంటీకి నాటో నో, అందుకే చర్చలు! -ఉక్రెయిన్
రష్యా దాడిని ప్రతిఘటించేందుకు అమెరికా, ఇతర నాటో దేశాలు ఆయుధాలు సరఫరా చేస్తున్నప్పటికి ఉక్రెయిన్ కు భవిష్యత్ లో భద్రత కల్పించేందుకు నాటో కూటమి ముందుకు రాలేదని అందుకే రష్యాతో చర్చలకు ముందుకు వచ్చామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ ప్రకటించాడు. చర్చల్లో ఉక్రెయిన్ తటస్థ వైఖరి గురించి చర్చించేందుకు కూడా జెలెన్ స్కీ సిద్ధపడటం ఒక విశేషం. అనగా అటు నాటో వైపు గానీ ఇటు రష్యా వైపు గానీ మొగ్గకుండా తటస్థ వైఖరి…