చిన్న శవపేటికలను పూడ్చడమూ కష్టమే!

“అతి చిన్న శవపేటికలు అత్యంత బరువైనవి” అంటూ తాలిబాన్ పైశాచిక హత్యాకాండను పాక్ ప్రజలు నిరసించారు. “చిన్న శవ పేటికలను పూడ్చడం చాలా కష్టమయింది” అని సమాధుల తవ్వకం దారు తాజ్ ముహమ్మద్ గాద్కదిక స్వరంతో, దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పాడు. పెషావర్ లోని అతి పెద్ద శ్మశాన వాటికలో సమాధులను తవ్వేవారిలో తాజ్ ముహమ్మద్ ఒకరు. ముస్లిం సంప్రదాయాల ప్రకారం శవాలను సాధ్యమైనంత త్వరగా పూడ్చిపెట్టాలి. దానితో డిసెంబర్ 16 తేదీన అమానుష రీతిలో దాడి జరగగా…