మోడి గాలి జనం ఒప్పుకోరు -నితీష్ కుమార్

ఎన్.డి.ఎ కూటమి ఏర్పడినప్పుడు విధించిన షరతులు ఇప్పటికీ వర్తిస్తాయని, అలా అయితేనే కూటమి కొనసాగుతుందని జనతా దళ్ (యునైటెడ్) పార్టీ నాయకుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశాడు. ‘తాము ఒక తుఫాను సృష్టిస్తామని, ప్రజలు దానిని అంగీకరిస్తారని’ కొంత మంది భావిస్తున్నారని, కానీ ప్రజలు చదువు లేకపోయినా చాలా తెలివైనవారని మోడిని పరోక్షంగా ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించాడు. తెలివైన ప్రజలు ఎలాంటి గాలిని ఒప్పుకోరని రాజకీయ నాయకులు చెప్పే మాటల్లో విషయం ఉన్నదీ లేనిదీ వారు…