శివసేనను తంతే కింద పడేది ఎవరు? -కార్టూన్

Yet again a sensible political cartoon from Keshav! కేశవ్ కుంచె నుండి రూపు దిద్దుకున్న మరో సున్నిత హాస్యస్ఫోరకమైన కార్టూన్! బి.జె.పి, శివసేనలు, ఆ పార్టీలు తమదిగా చెప్పుకునే రాజకీయ-సాంస్కృతిక-చారిత్రక భావజాలం రీత్యా, విడదీయరాని, విడదీయ లేని కవలలు. విడదీయలేని కవలలను విడదీయడానికి డాక్టర్లు తీవ్రంగా శ్రమించాలి. వైద్య శాస్త్రంలోని అనేక శాఖలలో నిష్ణాతులయిన వైద్యులు ఉమ్మడిగా, క్రమబద్ధంగా, జాగ్రత్తగా గంటల తరబడి కృషి చేస్తే గాని కవలలు ఇద్దరినీ ప్రాణంతో విడదీయడం సాధ్యం…

మహారాష్ట్ర: శివసేనకు ప్రతిపక్ష పాత్రేనా?

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. శివసేన తన అదుపాజ్ఞల్లో ఉంచుకోవాలన్న బి.జె.పి లక్ష్యం, ఆరు నూరైనా మహారాష్ట్ర వరకు తనదే పై చేయి కావాలని భావిస్తున్న శివసేన… వెరసి రాష్ట్ర ప్రజల ముందు ఓ వింత నాటకం ఆవిష్కృతం అవుతోంది. బి.జె.పికి బేషరతు మద్దతు ప్రకటించడం ద్వారా ఎన్.సి.పి, శివసేన బేరసారాల శక్తిని దారుణంగా దిగ్గోయడంతో బి.జె.పికి అదనపు శక్తి వచ్చినట్లయింది. కానీ బేషరతు మద్దతు ప్రకటించిన ఎన్.సి.పి అంత తేలిగ్గా సరెండర్ కాదని,…

చెప్పులు, కుర్చీలూ… అప్పుడప్పుడూ పూలు! -కార్టూన్

ఓపిక ఉండాలే గానీ ఎన్నికల చిత్రాలు ఎన్నయినా చెప్పుకోవచ్చు. ప్రత్యర్ధి రాజకీయ పార్టీలపైనా, అభ్యర్ధుల పైనా నానా కూతలూ కూసుకునే ఎన్నికల కాలంలో భరించలేని శబ్ద కాలుష్యం జనాన్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. ఒక్క శబ్ద కాలుష్యం ఏం ఖర్మ, పత్రికల నిండా సాహితీ కాలుష్యం కూడా దుర్గంధం వెదజల్లుతూ ఉంటుంది. ఒకరి లోపాలు మరొకరు ఎత్తి చూపుకుంటూ గాలిని నింపే దూషణలతో పాటు అప్పుడప్పుడూ -మారుతున్న కాలాన్నీ, మారని అవసరాలను బట్టి- ప్రత్యర్ధులపై ప్రశంసల పూల…

చిదంబరం దగ్గర ఉల్లి ఘాటు తగ్గించే చిట్కా -కార్టూన్

చిదంబరం: “పెరిగిపోతున్న కూరగాయల ధరలకు నేను బ్రహ్మాండమైన పరిష్కారం కనిపెట్టాను – 1000 టన్నుల ఉల్లిపాయలను ఎక్కడ పాతిపెట్టారో ఈయన గారు కలగన్నారట.” ***               ***                *** ఉల్లి పాయల రేట్లు మళ్ళీ ఊపిగొట్టేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో ఉల్లిపాయల ధర వంద రూపాయలు దాటిపోయిందని ఆంగ్ల, హిందీ ఛానెళ్ళు అదే పనిగా మొట్టుకుంటున్నాయి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ మాత్రం ఉల్లిపాయలకు వాస్తవంగా కొరత లేదని చెబుతున్నారు. వాస్తవంగా కొరత లేకుండా…

ఉల్లి భద్రతా బిల్లు కావాలి! -కార్టూన్

– “దానికంటే ముందు ఉల్లి భద్రతా బిల్లు తెస్తే ఎలా ఉంటుందంటారు?” – ఆహార భద్రతా బిల్లుకు ఎలాగైనా ఆమోదం పొందాలని కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని పత్రికలు చెబుతున్నాయి. రానున్న పార్లమెంటు ఎన్నికలకు గాను ఈ బిల్లును ‘ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్’గా కాంగ్రెస్ పరిగణిస్తోందనీ అందుకే ఈ బిల్లుపై అత్యంత పట్టుదలతో ఆ పార్టీ ఉన్నదనీ పత్రికల కధనం. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పట్టుబట్టి ఈ బిల్లుకు రూపకల్పన చేశారని కాబట్టి…

వరి, గోధుమ ఎగుమతులపై ఆశ చావని శరద్ పవార్

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ కి వరి, గోధుమ ఎగుమతులపై ఆశ చావక మరోసారి నోరు విప్పారు. వరి, గోధమల ధరలు ప్రపంచ మార్కెట్ లో ఆశాజనకంగా ఉన్నాయని, నిల్వలు కూడా అధికంగా ఉన్నాయి కనుక ఎగుమతి చేయడానికి ఇదే సరైన సమయమని, ప్రభుత్వం వరి, గోధుమ ధాన్యాల ఎగుమతులకు అనుమతించాలని ఆయన పత్రికా ముఖంగా ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వంలో ఓ మంత్రిగా ఉంటూ, అందునా వ్యవసాయ మంత్రిగా ఉంటూ పత్రికాముఖంగా డిమాండ్ చేయడం…