తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ లపై రష్యా దాడులు, గందరగోళంలో అమెరికా!
రష్యన్ బలగాలు తూర్పు మరియు దక్షిణ ఉక్రెయిన్ రాష్ట్రాలలోని నగరాలపై దాడులు చేస్తోంది. ప్రస్తుతం వైమానిక దాడుల వరకే రష్యా పరిమితమయింది. రష్యా సైనికులు మాత్రం తూర్పు ఉక్రెయిన్ వరకే పరిమితం అయ్యారు. రాయిటర్స్ ప్రకారం రష్యన్ బలగాలు ఉక్రెయిన్ లోని పలు బలగాలపై వైమానిక దాడులు చేస్తున్నాయి. రష్యా దాడులను పూర్తి స్థాయి దాడిగా చెప్పలేని గందరగోళంలో అమెరికా పడిపోయినట్లు కనిపిస్తోంది. డోనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ (డిపిఆర్), లుగాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ (ఎల్‌పిఆర్) లను స్వతంత్ర…