టెర్రరిస్టు వ్యతిరేక పోరాట సహకారానికి అమెరికా మొండి చేయి
భారత దేశం ఎదుర్కొంటున్న టెర్రరిస్టు సమస్య పై పోరాటంలో సహకారం ఇవ్వవలసిన అమెరికా అందుకు నిరాకరిస్తున్నదని భారత పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి. టెర్రరిజం పై పోరాడేందుకు ఇరు దేశాల మధ్య సహకార ఒప్పందం ఉన్నప్పటికి అది ఆచరణలో ఒక వైపు మాత్రమే అమలవుతోందని చెబుతున్నాయి. భారత దేశం వైపు నుండి అమెరికాకి ఎంతగా సహకారం అందజేస్తున్నప్పటికీ భారత దేశానికి సహకారం ఇవ్వవలసిన పరిస్ధితిలో అమెరికా మొండి చేయి చూపుతోందని ఆరోపిస్తున్నాయి. మూడు రోజుల క్రితం ఇరు దేశాల విదేశాంగ…