ఇరాన్ ఆయిల్: ఇండియాపై దుష్ప్రచారం తగదు -నిరుపమ
ఇరాన్ క్రూడాయిల్ దిగుమతుల విషయంలో ఇండియా పై జరుగుతున్న ప్రతికూల ప్రచారం పనికి రాదని అమెరికాలో భారత రాయబారి నిరుపమా రావు అభ్యంతరం తెలిపారు. 120 కోట్ల మంది ప్రజల ఎనర్జీ అవసరాలను తీర్చవలసిన బాధ్యత భారత ప్రభుత్వానికి ఉందన్న సంగతి గ్రహించాలని ఆమె అమెరికాకి పరోక్షంగా సూచించింది. ఐక్యరాజ్య సమితి ఆంక్షలను తు.చ తప్పకుండా పాటిస్తున్నామనీ, అమెరికా ఆంక్షలను కూడా దృష్టిలో పెట్టుకుని ఇరాన్ క్రూడాయిల్ దిగుమతులనూ తగ్గించామనీ ఆమె వివరించారు. ఇరాన్ క్రూడాయిల్ పట్ల…