ఎనలైజ్: వ్యవసాయ సబ్సిడీలు ఎందుకివ్వాలి? -ఈనాడు

‘అధ్యయనం’ ధారావాహికలో ఆరవ భాగం నేటి ఈనాడు పత్రికలో ప్రచురితమయింది. గత వారం ‘ఎనలైజ్’ అనే డైరెక్టివ్ గురించి వివరించిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా ఓ ఉదాహరణ తీసుకుని ఈ వారం వివరించాను. వ్యవసాయ సబ్సిడీలకు సంబంధించి గత సంవత్సరం జనరల్ స్టడీస్ పేపర్ లో ఇచ్చిన ప్రశ్నను ఉదాహరణగా తీసుకున్నాను. ఆర్టికల్ ను నేరుగా ఈనాడు ఆన్ లైన్ ఎడిషన్ లో చూడాలనుకుంటే కింది లంకె పైన క్లిక్ చేసి చూడగలరు. ఈ లంకే…

బడ్జెట్ 2013-14: సబ్సిడీల్లో భారీ కోత

2013-14 ఆర్ధిక సంవత్సరానికి గాను గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ప్రభుత్వం సబ్సిడీలలో భారీ కోతలు ప్రతిపాదించింది. పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగంలో ఆర్ధిక మంత్రి చిదంబరం ఈ కోతల గురించి ఒక్క ముక్క కూడా చెప్పకుండా దాచిపెట్టాడు. నిజానికి సబ్సిడీలను తగ్గించవలసిన అవసరం గురించి ప్రధాని, ఆర్ధిక మంత్రి, ప్రధాని ఆర్ధిక సలహా బృందం, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు తదితరులంతా వీలు దొరికినప్పుడల్లా బోధనలు, సలహాలు, హెచ్చరికలు చేస్తూ వచ్చారు. వాటిని అమలు చేసే సమయంలో మాత్రం…

ఎరువుల రేట్ల తగ్గుదల రైతుకి చేరకుండా నోక్కేసిన కేంద్ర ప్రభుత్వం

అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు గణనీయంగా తగ్గినప్పటికీ ఆ తగ్గుదల రైతుకీ చేరకుండా కేంద్ర ప్రభుత్వం నోక్కేసింది. పెట్రోల్ ధరలు పెరిగినప్పుడల్లా కంపెనీలకు నష్టం వస్తోందంటూ పెంచే ప్రభుత్వం అవి తగ్గినపుడు మాత్రం, ఆ తగ్గుదలను ప్రజలకు అందకుండా తానే నోక్కేస్తుంది. అదే పద్ధతిని ఎరువుల విషయంలో కూడా అనుసరించడానికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఎరువల ధరలను చాలా కాలం క్రితమే ప్రభుత్వం డీ కంట్రోల్ చేసింది. దానివల్ల ఎరువుల ధరలు సాధారణ రైరులకు అందనంత ఎత్తులో…

ప్రపంచ ఆహార పంపిణీ వ్యవస్ధే రైతులకు నష్టాల్నీ పేదలకు ఆకలి చావుల్నీ సృష్టిస్తోంది -ఆక్స్‌ఫాం

ప్రపంచ దేశాల్లొ ప్రస్తుతం కొనసాగుతున్న ఆహార పంపిణీ వ్యవస్ధలే పేదల్ని ఆకలి చావులకు గురి చేస్తున్నదని చారిటీ సంస్ధ ఆక్స్‌ఫాం కుండ బద్దలు కొట్టింది. ప్రపంచ ఆహార వ్యవస్ధ కేవల కొద్దిమంది కోసమే పని చేస్తున్నదని, మిగిలిన వారందరికీ అది విఫల వ్యవస్ధగా మారిందనీ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఆక్స్‌ఫాం పేర్కొంది. ప్రపంచ ఆహార పంపిణీ వ్యవస్ధ, ఆహారాన్ని వినియోగించే బిలియన్ల మంది ప్రజలకు తాము ఏమి కొంటున్నదీ, ఏమి తింటున్నదీ అన్న అంశాలపై సరిపోయినంత…