ఈ శ్రామిక మహిళ, మౌనంగానే… ఎదిగింది -కత్తిరింపు
వ్యవసాయాన్ని కనిపెట్టింది మహిళలని సామాజిక చరిత్రకారులు చెబుతారు. ఈ విషయంలో ఎవరికన్నా అనుమానం ఉంటే ఖమ్మం జిల్లాలోని వేలేరుపాడు మండలం జిన్నెల గూడెం నివాసి సాయమ్మను చూస్తే తమ అనుమానాన్ని ఇట్టే పోగొట్టుకుంటారు. సొంత పొలంలో వ్యవసాయం చెయ్యడమే కాకుండా సొంత పనిలేనప్పుడు కూలీకి కూడా వెళ్ళే సాయమ్మ తన జీవితాన్ని శ్రమకే అంకితం చేసింది. ఒంటరి వ్యవసాయంతో సోదరి కుటుంబాన్ని సైతం ఆదుకుంటున్న సాయమ్మ సాహసిక జీవనాన్ని వెలుగులోకి తెచ్చిన సాక్షి విలేఖరి ఎం.ఏ.సమీర్ అభినందనీయులు.…