ప్రశ్న: మన డేటా అమ్ముకుంటే నష్టం ఏమిటి?

లోకేశ్వర్: “వినియోగదారుల సమాచారాన్ని ఇతర సంస్థలకు అమ్ముకుంటే మనకు వచ్చే నష్టమేంటి? సేవలని ఉచితంగా ఇస్తున్నప్పుడు వాటిని పూడ్చుకోవడానికి ఇలాంటివి చేయడంలో తప్పేముంది?” అనే సగటు పౌరుడి/వినియోగదారుడికి సమాధానం ఏంటి? (నాకు కూడా) సమాధానం:  ఈ అనుమానానికి చాలా పెద్ద సమాధానం, సమాచారం ఇవ్వాలి. విస్తృత విశ్లేషణ చెయ్యాలి. అందుకని కాస్త తీరికగా రాయొచ్చు అనుకున్నాను. మీరు రెండోసారి అడగడంతో క్లుప్తంగా రాస్తున్నాను. మనకొక ఉత్తరం వచ్చిందనుకుందాం. దాన్ని పక్కింటి వాళ్ళు చించి చదివితే మన రియాక్షన్…

గూగుల్ చాలా ఘోరాలు చేస్తోంది -అమెరికా రెగ్యులేటర్ ఎఫ్.టి.సి

సెర్చి ఇంజన్ల వ్యాపారంలో ఎవరికీ అందనంత ఎత్తుకు చేరుకున్న గూగుల్ వినియోగదారుల హక్కులను పరిరక్షించడంలో పదే పదే తప్పు చేస్తోంది. గూగుల్ స్ట్రీట్ వ్యూ పేరుతో వైర్ లెస్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తూ అనేక దేశాల్లో దొరికిపోయిన గూగుల్ చివరికి తన ఈ మెయిల్ ప్రోగ్రాం ఐన జీమెయిల్ వినియోగదారుల సమాచారాన్ని కూడా తన వ్యాపార ప్రయోజనాలకు వినియోగించి అమెరికా నియంత్రణ సంస్ధకు దొరికిపోయింది. ఇలా అడ్డంగా దొరికిపోవడం గూగుల్ కి…